Hari Hara Veera Mallu Postponed : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు మరోసారి గుండెని రాయి చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 12న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఇప్పుడు మరోసారి వాయిదా పడింది అంటూ వార్తలు వస్తున్నాయి. నేడు సాయంత్రం నిర్మాత AM రత్నం ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ విషయాన్నీ అధికారికంగా తెలియజేయబోతున్నట్టు సమాచారం. నేడు ఈ చిత్రాన్ని సెన్సార్ కార్యక్రమాలకు పంపించారు. మధ్యాహ్నం మూడు గంటలకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవుతాయి, ఇక ఆ సెన్సార్ టాక్ వస్తుంది. సినిమాకి కావాల్సిన బజ్ మొత్తం క్రియేట్ అవుతుంది అంటూ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంతలోపే ఈ సినిమా వాయిదా పడింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త లీక్ అయ్యింది. ఇక సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహంతో ఫైర్ మోడ్ లోకి వెళ్ళిపోయింది.
నిర్మాత AM రత్నం ని ట్యాగ్ చేసి లకారాలతో బూతులు తిడుతున్నారు. ఇంతకీ ఈ సినిమా విడుదల వాయిదా వేయడానికి కారణాలు సోషల్ మీడియా లో అనేకం చెప్తున్నారు. కొంతమంది నిర్మాత ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండడం వల్లనే ఈ సినిమా వాయిదా పడిందని అంటున్నారు. మరికొంతమంది అయితే సెకండ్ హాఫ్ కి సంబంధించిన VFX వర్క్ మొత్తం బ్యాలన్స్ ఉందని, ఇరాన్ నుండి రావాల్సిన CG షాట్స్ ఇంకా రాలేదని, జూన్ 10 న వాళ్ళు డెలివర్ చేస్తారని అంటున్నారు. జూన్ 10 డెలివర్ చేస్తే సినిమాని విడుదల చేయడం అసాధ్యం. ఎందుకంటే ఓవర్సీస్ కి ప్రింట్స్ ని మూడు రోజుల ముందే పంపాలి. ఇక చేసేది ఏమి లేక విడుదలని వాయిదా వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని జులై 4 న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
Also Read : హరి హర వీరమల్లు’ లో హైలైట్ అయ్యే సన్నివేశాలు ఇవే..కానీ సెకండ్ హాఫ్ రిస్క్ ఉంది!
సినిమా విడుదలకు చాలా సమయం ఉంది కాబట్టి ఈలోపు VFX షాట్స్ వచ్చేస్తే, ట్రైలర్ ని విడుదల చేసి,సరైన రీతిలో ప్రొమోషన్స్ చేసి, సినిమా మీద అంచనాలను భారీగా పెంచితే బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతుందని, అప్పుడు విడుదల చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందని అంటున్నారు మేకర్స్. జూన్ 12 న సినిమా అంటే ఇప్పటి వరకు థియేట్రికల్ ట్రైలర్ ని కూడా సిద్ధం చేయనప్పుడే అభిమానులకు ఈ సినిమా విడుదలపై అనుమానం వచ్చింది. వాళ్ళ ఊహలకు తగ్గట్టుగానే వాయిదా పడి అందరికి షాక్ ని ఇచ్చింది. ఇకనైనా విడుదల తేదికి సినిమా సిద్ధం అయ్యేలా చూస్తారా?, లేకపోతే మళ్ళీ వాయిదాలు వేసుకుంటూ వెళ్తారా అనేది చూడాలి. జూన్ 12 మంచి డేట్. పోటీకి ఏ భాషలోనూ మరో సినిమా లేదు. మళ్ళీ ఇలాంటి డేట్ రావడం కష్టమే. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.