Shreyas Lyer Leads Team to Final : అయ్యర్ ఆధ్వర్యంలో ఐపీఎల్లో గత సీజన్లో షారుక్ ఖాన్ జట్టు ఛాంపియన్ అయింది. ఈ సీజన్లో ప్రీతి జింటా జట్టు అయ్యర్ ఆధ్వర్యంలో చివరి దాకా వెళ్ళింది. దురదృష్టం కొద్ది తుది పోరులో కన్నడ జట్టు చేతిలో ఓటమిపాలైంది.. లేకపోతే అయ్యర్ చేతికి మరో ఐపీఎల్ ట్రోఫీ వచ్చేది. వాస్తవానికి గత సీజన్లలో ప్రీతి జింటా జట్టు ఏమాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. కనీసం ప్రత్యర్థులకు పోటీ కూడా ఇవ్వలేదు. అలాంటిది అయ్యర్ ఆధ్వర్యంలో ఈ సీజన్లో దుమ్మురేపింది. గొప్ప గొప్ప జట్లను సైతం నేల నాకించింది.. తుది పోరులో గనుక సత్తా చాటి ఉంటే ఫలితం వేరే విధంగా ఉండేది. అయితే కన్నడ జట్టు చేతిలో ఓడిపోయినప్పటికీ అయ్యర్.. తన జోరు ఏమాత్రం తగ్గించడం లేదు. తన నాయకత్వ పటిమను ఏమాత్రం తక్కువ చేయడం లేదు. తాజాగా ముంబై జట్టు ను తుది పోరులోకి తీసుకెళ్లాడు అయ్యర్. అయ్యర్ ఆధ్వర్యంలో సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు ఇప్పుడు ముంబై టీ20 లీగ్ లో ట్రోఫీ అందుకోవడానికి ఒక అడుగు దూరంలో నిలిచింది.. వాస్తవానికి సారధిగా అయ్యర్ తన జట్లను తుది పోరుకు తీసుకెళ్లిన నాలుగు సందర్భాలలో కూడా వ్యక్తిగతంగా అదరగొట్టాడు. 2024 సీజన్లో షారుక్ ఖాన్ జట్టును విజేతగా నిలిపిన సందర్భంలో 15 మ్యాచ్లలో 351 పరుగులు చేశాడు. ఆ తర్వాత ముంబై జట్టును ముస్తాక్ అలీ ట్రోఫీలో విజేతగా నిలిపాడు. నాడు అతడు 345 రన్స్ చేశాడు. ఇక ఇటీవలి ఐపిఎల్ లో 604 పరుగులు చేశాడు. ముంబై టీ20 లీగ్ లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తన స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక బుధవారం నాటి సెమి ఫైనల్ మ్యాచ్లో ముంబై ఫాల్కన్స్ నమో బాంద్రా బ్లాస్టర్ జట్టును ఓడించింది. తద్వారా తుది పోరుకు అర్హత సాధించింది.
Also Read : వారు ఔట్.. ఐపీఎల్ లో కోచ్ ల నుంచి ప్లేయర్ల దాకా ఏరివేత మొదలుపెట్టిన జట్లు..
ఏడాది కాలంలో నాలుగోసారి..
ఏడాది కాలంలో అయ్యర్ తను నాయకత్వం వహిస్తున్న బృందాలను తుది పోరుకు తీసుకెళ్లడం ఇది నాలుగోసారి. 2024లో షారుక్ ఖాన్ జట్టును విజేతగా నిలిపిన నాటి నుంచి అయ్యర్ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. అతడు జయతియాత్ర విజయవంతంగా సాగుతోంది. 2024 సీజన్లో షారుక్ ఖాన్ జట్టును అయ్యర్ ఛాంపియన్ చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టును విజేతను చేశాడు. ఇక తాజా ఐపీఎల్ లో ప్రీతిజింటజట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. దాదాపు దశాబ్దం అనంతరం పంజాబ్ జట్టు ఐపిఎల్ ఫైనల్ వెళ్లడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో మూడు వేరువేరు బృందాలను ఫైనల్ దాకా తీసుకెళ్లిన సారధిగా అయ్యర్ రికార్డు సృష్టించాడు. 2019లో ఢిల్లీ జట్టును, 2024లో షారుక్ ఖాన్ జట్టును, 2025లో ప్రీతి జింటా జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు అయ్యారు. ఇక ముంబై ప్రీమియర్ లీగ్ లో ఫాల్కన్స్ జట్టుకు అతడు నాయకత్వం వహిస్తున్నాడు. సెమి ఫైనల్లో నమో బాంద్రా జట్టును ఐదు వికెట్ల తేడాతో మట్టికరించాడు. 130 రన్స్ టార్గెట్ ను ముంబై ఫాల్కన్స్ 14.4 ఓవర్లలోనే ఫినిష్ చేయడం విశేషం. ఈ మ్యాచ్లో అయ్య ఒక పరుగు మాత్రమే చేసినప్పటికీ.. తన జట్టును అత్యంత విజయవంతంగా తుది పోరు దాకా తీసుకెళ్లాడు. ఇక శుక్రవారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్లో సిద్దేష్ లాడ్ నాయకత్వం వహిస్తున్న ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ జట్టుతో శ్రేయస్ బృందం తలపడుతుంది. ఒకవేళ గనుక ఈ టైటిల్ అయ్యర్ ఆధ్వర్యంలో ని జట్టు సాధిస్తే అతడికి తిరుగు ఉండదు.