Local Support of YSRCP : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి విశాఖ అనేది కొరకరాని కొయ్యగా మారిపోయింది. అసలు పట్టు చిక్కడం లేదు అక్కడ. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం నెగ్గలేకపోయింది. 2024 లో అయితే చెప్పనవసరం లేదు. అలాగని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఎందుకో ఇక్కడ విశాఖ ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పెద్దగా ఆదరించడం లేదు. ఆది నుంచి పెద్దపెద్ద నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. నాయకులపరంగా పరవాలేకున్నా.. ప్రజల అభిమానాన్ని మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూరగోనలేకపోయింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖలో చాలా రకాల ప్రయోగాలు చేసింది. కానీ ఆ ప్రయోగాలు వికటించాయే తప్ప.. ఫలించిన దాఖలాలు లేవు.
* సీనియర్ల అండ..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు ఆయన వెంట నడిచిన నేత సబ్బం హరి. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కూడా. మరో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో ఆయన వెంట నడిచారు. ఇక టిడిపిలో సుదీర్ఘకాలం పనిచేసి ఎన్నో పదవులు అలంకరించిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా జగన్ చెంతకు చేరారు. కేవలం ఎమ్మెల్సీగా రెన్యువల్ చేయలేదన్న ఆవేదనతో దాడి వీరభద్రరావు నాడు ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు విశాఖ రాజకీయాలను శాసించిన వారే. వీరంతా జగన్మోహన్ రెడ్డికి మూకుమ్మడిగా మద్దతు తెలపడంతో ఇక విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేకుండా పోతుందని అంతా అంచనా వేశారు. కానీ కనీసం టిడిపిని ఇక్కడ కదిలించలేకపోయారు.
Also Read : వెన్నుపోటు దినోత్సవం.. ఈసారి వైసీపీ ప్లాన్లు అంతకుమించి..
* అప్పట్లో విజయమ్మ..
నేరుగా వైయస్ విజయమ్మను( y s Vijayamma) రంగంలోకి దించారు. ఆమె ద్వారా ఉత్తరాంధ్రలో సానుకూల ఫలితాలు రాబెట్టాలని చూశారు. 2014 ఎన్నికల్లో వైయస్ విజయమ్మను విశాఖపట్నం నుంచి నిలబెట్టారు. కానీ ఆమె బిజెపి అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో ఓడిపోయారు. ఆమె అభ్యర్థిత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదు. పైగా అక్కడి నుంచి సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీకి దూరమయ్యారు. సబ్బం హరి ముందుగా పార్టీకి రాజీనామా చేశారు. కొణతాల రామకృష్ణ సైతం తన పెద్దరికానికి గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయారు. దాడి వీరభద్రరావు సైతం పక్కకు తప్పుకున్నారు. మళ్లీ జగన్ పిలుపుమేరకు ఆ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఈ ఎన్నికల కు ముందు తిరిగి టిడిపిలోకి వచ్చేశారు.
* వారంతా పార్టీకి దూరం..
విశాఖలో ( Visakhapatnam) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండే అవంతి శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, పంచకర్ల రమేష్ బాబు వంటి నాయకులంతా కూటమి పార్టీల్లో చేరిపోయారు. ఎందుకో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే విశాఖ ప్రజలకు వ్యతిరేక భావం ఏర్పడింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏకంగా 30 కార్పొరేటర్ లను గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుపోయింది. అటువంటి చోట స్థానిక నాయకులకు కాదని.. స్థానికేతరులకు అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. బొత్స సత్యనారాయణకు విశాఖ శాసనమండలి ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబును నియమించారు. పరిశీలకుడిగా ప్రకాశం జిల్లాకు చెందిన కదిరి బాబురావు భర్తీ చేశారు. అయితే ఇన్ని చేసిన అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తానికైతే విశాఖ ఒక ప్రయోగశాలుగా మార్చింది