IPL 2026 Teams: క్రికెట్ లో మన దేశం కేంద్రంగా సాగే ఐపిఎల్ కు విశేష ఆదరణ ఉంది. ఏకంగా ఐపీఎల్ బ్రాండ్ విలువ లక్ష కోట్లకు పెరిగింది అంటే.. దాని స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా ఐపీఎల్ సాగుతూ ఉంటుంది. అయితే ఈ పోటీలలో ఒక జట్టు మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. ఈసారి కన్నడ జట్టుకు ఆ అవకాశం లభించింది. పంజాబ్ జట్టుకు రెండవ స్థానం దక్కింది.
ఈసారి జరిగిన ఐపీఎల్లో కన్నడ, ప్రీతి జింటా, హార్దిక్, గిల్ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. అక్షర్, కమిన్స్ జట్లు 5, 6 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. రిషబ్ పంత్, రహానే, సంజు శాంసన్, ధోని జట్లు ఏడు నుంచి పది స్థానాలలో నిలిచాయి. అయితే చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఏరి వేత మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లక్నో జట్టు జహీర్ ఖాన్ మీద వేటు వేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపు పంత్ ను సారధిగా కొనసాగించాలా? బయటికి పంపించాలా? అనే విషయాలపై కూడా మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మయాంక్ యాదవ్ కు స్థానచలనం కలిగించాలనే ఆలోచనకు లక్నో మేనేజ్మెంట్ వచ్చినట్టు సమాచారం.
కోల్ కతా జట్టు మేనేజ్మెంట్ వెంకటేష్ అయ్యర్ ను వదిలించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. డికాక్, రస్సెల్ విషయంలోనూ మేనేజ్మెంట్ అదే తీరుగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జాబితాలో రమణ్ దీప్ సింగ్ కూడా ఉన్నాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రాజస్థాన్ జట్టులోను కీలకమైన మార్పులు చోటుచేసుకునే అవకాశము ఉందని తెలుస్తోంది. హిట్ మేయర్ ను పక్కకు పంపించాలని.. ద్రావిడ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సంజు, జైస్వాల్ జట్టును వీడి వెళ్లిపోతారని.. ఆ అవకాశాన్ని మేనేజ్మెంట్ స్వయంగా కల్పిస్తోందని తెలుస్తోంది.
చెన్నై జట్టు మేనేజ్మెంట్ ఉర్విల్ పటేల్, ధోని, జడేజా, నూర్ అహ్మద్, బ్రేవిస్, రుతు రాజ్ గైక్వాడ్ ను మాత్రమే అంటిపెట్టుకొని.. మిగతా ప్లేయర్లను వదిలేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనుక కార్యరూపం దాచితే వచ్చే సీజన్లో చెన్నై జట్టులో కొత్త ఆటగాళ్లు కనిపించే అవకాశం ఉంది.
అయితే ఇటీవల ధోని తన జట్టు నుంచి వెళ్లిపోతాడని.. పొట్టి ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరిగింది. అయితే అదంతా నిజం కాదని.. ధోని వచ్చే సీజన్లో కూడా ఆడతాడని తెలుస్తోంది.. చెన్నై జట్టు మేనేజ్మెంట్ కూడా ఇదేవిధంగా సంకేతాలు ఇచ్చింది. అభిమానులు ధైర్యంగా ఉండాలని.. ఎటువంటి అపోహలు పెట్టుకోకూడదని చెబుతోంది. ధోని పరోక్ష నాయకత్వంలో చెన్నై జట్టు వచ్చే సీజన్లో ఆడుతుందని మేనేజ్మెంట్ ఇప్పటికే స్పష్టం చేసింది.