Homeక్రీడలుక్రికెట్‌Shivam Dube: సిక్సర్ల దూబే కాదు.. జట్టులో ఎక్స్ ట్రా ఫింగర్..

Shivam Dube: సిక్సర్ల దూబే కాదు.. జట్టులో ఎక్స్ ట్రా ఫింగర్..

Shivam Dube: శివం దూబే గురించి చర్చకు వచ్చినప్పుడు.. చాలామంది మాట్లాడుకునే మాట.. అతడు సిక్సర్ల దూబే అని.. కానీ అతడు విఫలమవుతున్నాడు. సిక్సర్ల నుంచి.. సున్నా లేదా ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అవుతున్నాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నతంగా ఆడాల్సిన అతడు.. మరింత దారుణంగా ఆడుతున్నాడు. అసలు అతడికి చోటు ఎందుకు ఇచ్చారు.. మిగతా ప్లేయర్లు లేరా.. అతడి కంటే సమర్థులు జట్టులో కనిపించడం లేదా.. అనే ప్రశ్నలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. […]

Shivam Dube: శివం దూబే గురించి చర్చకు వచ్చినప్పుడు.. చాలామంది మాట్లాడుకునే మాట.. అతడు సిక్సర్ల దూబే అని.. కానీ అతడు విఫలమవుతున్నాడు. సిక్సర్ల నుంచి.. సున్నా లేదా ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అవుతున్నాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నతంగా ఆడాల్సిన అతడు.. మరింత దారుణంగా ఆడుతున్నాడు. అసలు అతడికి చోటు ఎందుకు ఇచ్చారు.. మిగతా ప్లేయర్లు లేరా.. అతడి కంటే సమర్థులు జట్టులో కనిపించడం లేదా.. అనే ప్రశ్నలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో దూబే అంతగా ఆకట్టుకోలేదు. తొలి మ్యాచ్ మినహా.. మిగతా అన్నిట్లో అతను విఫలమయ్యాడు. ఐదు మ్యాచ్లలో అతడు వరుసగా 42, 5, 2, 22, 14 పరుగులు చేశాడు. ఒకవేళ అతడు గట్టిగా నిలబడి ఉండి ఉంటే.. టీమిండియా కచ్చితంగా టి20 సిరీస్ కోల్పోయి ఉండేది కాదు. కానీ అతడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. మేనేజ్మెంట్ నమ్మకాన్ని కాపాడుకోలేకపోయాడు.

ఇప్పుడు జరుగుతున్న వన్డే సిరీస్ లో కూడా అతడు దారుణమైన ఆట తీరు కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా రెండవ మ్యాచ్లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయినప్పుడు.. మైదానంలోకి వచ్చిన అతడు. నిలబడి పరుగులు చేయాల్సి ఉండగా.. కేవలం 0 పరుగులకు అవుట్ అయ్యాడు. కనీసం బంతిని గట్టిగా ఎదుర్కోలేకపోయాడు. వికెట్లు పడుతున్న విషయం తెలిసినప్పటికీ. అతడు కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు అంటే.. బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి నిర్లక్ష్యమైన ఆట తీరు కొనసాగిస్తున్న అతనిని జట్టు నుంచి తొలగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

” అతడిని ఎందుకు జట్టులోకి తీసుకుంటున్నారు.. అతడి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా.. ఒక మనిషికి ఆరవ వేలు గనుక ఉండి ఉంటే.. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దూబే కూడా టీమిండియాకు అలానే మారిపోయాడు. అతని వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. జట్టుకు నిలబడి పరుగులు చేయలేకపోతున్నాడు. కనీసం బౌలింగ్లో వికెట్లు కూడా తేలేకపోతున్నాడు. ఇతడి కోసం మిగతా వాళ్లను ఎందుకు జట్టుకు దూరంగా పెడుతున్నారని” అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఇతడి విషయంలో మేనేజ్మెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. గౌతమ్ గంబీర్ ఇన్నాళ్లపాటు సపోర్ట్ చేశాడని, ఇకపై అతడు కూడా సపోర్ట్ చేసే అవకాశం లేదని సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper