Homeక్రీడలుక్రికెట్‌Shubman Gill : గిల్.. గంభీర్ శిక్షణలో టీమిండియా కు లభించిన వరం ఇదొక్కటే..

Shubman Gill : గిల్.. గంభీర్ శిక్షణలో టీమిండియా కు లభించిన వరం ఇదొక్కటే..

Shubman Gill : సిరీస్ డిసైడర్ మ్యాచ్ అది. పైగా ఆడుతోంది ఇంగ్లాండు గడ్డమీద. అందులోనూ లార్డ్స్ మైదానంలో.. బౌలర్లకు ఏమాత్రం అనుకూలంగా పరిస్థితులు లేవు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ పరుగుల వరద పారించింది.. సంచలన బ్యాటింగ్ తో ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు వీరవిహారం చేసి ఏకంగా 387 పరుగులు చేశారు. వాస్తవానికి టీం ఇండియాకు వన్డేలలో ఇంతటి లక్ష్యాన్ని చేదించిన చరిత్ర లేదు. ఆస్ట్రేలియా మీద 360 పరుగులను మాత్రమే టీమిండియా చేజ్ చేయగలిగింది.

ఇంతటి కఠినమైన లక్ష్యం.. అందులోనూ ఇంగ్లాండు బౌలింగ్ అద్భుతంగా సాగుతున్న సమయంలో.. టీమిండియా నిలవగలుగుతుందా.. పరుగులు తీయగలుగుతుందా.. పైగా రోహిత్ ఓపెనర్ గా ఈ సిరీస్ లో ఇంతవరకు ఆకట్టుకున్నది లేదు. గిల్ కూడా కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇలాంటి సమయంలో ఓపెనర్లు మెరుగైన భాగస్వామ్యాన్ని నమోదు చేయగలరా.. అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ అనుమానాలను కెప్టెన్ గిల్ పటా పంచలు చేశాడు. తను 82 బంతుల్లో 77* పరుగులు చేశాడు. ఈ సిరీస్లో రెండవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్న నేపథ్యంలో సమర్థవంతంగా నిలబడ్డాడు. నాయకుడిగా మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన ఓపెనర్ గా పరుగులు తీశాడు. తొలి వికెట్ కు రోహిత్ శర్మతో కలిసి ఏకంగా 146 పరుగులు జోడించాడు. అత్యంత కఠినమైన లక్ష్యాన్ని చేదించే క్రమంలో గిల్ ఇలా నిలబడడం నిజంగా అభినందనీయం. గిల్ కు కాళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. అతడు బ్యాటింగ్ చేయగలిగాడు. పరుగులు తీయగలిగాడు. ఇంగ్లాండ్ బౌలర్ల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగాడు.

గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత గిల్ కు జట్టులో సింహ భాగం లభించింది. వచ్చిన అవకాశాన్ని గిల్ అందిపుచ్చుకున్నాడు. తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. నాయకుడిగా.. సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అంతేకాకుండా ఆటగాడిగా కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. గౌతమ్ గంభీర్ శిక్షణలో టీమిండియా కు జరిగిన లాభం ఏదైనా ఉందంటే అది ఇది ఒక్కటి మాత్రమే. కాళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినప్పటికీ.. గిల్ ఇలా నిలబడడం భవిష్యత్తు కాలంలో.. టీమిండియాకు ఎంతో లాభదాయకం. వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కు ఇలాంటి నాయకుడు ఉంటే మాత్రం తిరుగు ఉండదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular