Shane Warne Death Real Reason: లెగ్ స్పిన్ కు సరికొత్త అర్థం చెప్పిన మాయాజాలికుడు షేన్ వార్న్. ఆస్ట్రేలియా జట్టులో కీలక బౌలర్ గా.. టెస్ట్ ఫార్మాట్లో భారీగా వికెట్లు సాధించిన ఆటగాటిగా షేన్ వార్న్ ప్రపంచానికి సుపరిచితుడు. మైదానంలో ఎలాగైతే అద్భుతంగా బౌలింగ్ చేస్తాడో.. మైదానం వెలుపల సంబంధాలు కొనసాగించడంలో అంతే దూకుడు కొనసాగిస్తాడు. అతడిని అప్పట్లో మహిళల పాలిటి సుందరాంగుడు అని పిలిచేవారు.
ఐపీఎల్ ప్రారంభ సంవత్సరంలో రాజస్థాన్ జట్టుకు ట్రోఫీ అందించి.. స్థాయి ఏమిటో నిరూపించుకున్నాడు షేన్ వార్న్.. మామూలుగా అయితే బౌలర్లు బౌలింగ్ చేసి.. వెంటనే తమ స్థానంలోకి వెళ్లిపోతారు. అక్కడ ఫీల్డింగ్ చేస్తారు. కానీ, షేన్ వార్న్ అలా కాదు.. బౌలింగ్ చేస్తూనే బ్యాటర్ శైలి గమనిస్తాడు. ఒకవేళ తను వికెట్ తీయలేకపోత.. ఆ బ్యాటర్ గురించి కెప్టెన్ కు చెబుతాడు. అవసరమైతే కొన్ని సలహాలు కూడా ఇస్తుంటాడు. అదే షేన్ వార్న్ ను ఆస్ట్రేలియా జట్టులో ప్రత్యేకంగా నిలబెట్టింది.
క్రికెట్లో లెజెండరీ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న షేన్ వార్న్ 2022లో కన్నుమూశాడు. వాస్తవానికి అతడు చనిపోడాన్ని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అంతటి విరోధం ఉన్న హర్భజన్ సింగ్ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా షేన్ వార్న్ కుటుంబానికి సంతాపం తెలిపాడు. గొప్ప ఆటగాడిని కోల్పోయామని నిర్వేదం వ్యక్తం చేశాడు. వాస్తవానికి అతని మరణానికి అనారోగ్యం కారణమని ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వచ్చాయి. అంతర్జాతీయ మీడియా కూడా దీనిని ధ్రువీకరించింది. అయితే ఇన్నాళ్లకు షేన్ వార్న్ మరణం పట్ల అసలు విషయాన్ని అతని కుమారుడు బయటపెట్టాడు.
షేన్ వార్న్ చనిపోవడానికి కారణం అనారోగ్యం కాదట. కరోనా వ్యాక్సిన్ వల్ల అతడు చనిపోయాడని షేన్ వార్న్ కుమారుడు జాక్సన్ వెల్లడించాడు.. ఆ వ్యాక్సిన్ వల్ల తన తండ్రి శరీరంలో అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు.. ఓ ఇంటర్వ్యూలో అతడు ఈ విషయాలను వెల్లడించాడు. ఇతరుల ఒత్తిడి వల్ల ఇష్టం లేకపోయినా సరే తన తండ్రి వ్యాక్సిన్ వేసుకున్నాడని జాక్సన్ పేర్కొన్నాడు. వాస్తవానికి ఈ విషయాన్ని అప్పుడే బయటపెట్టాలని అనుకున్నప్పటికీ.. కొందరి ఒత్తిడి వల్ల చెప్పలేకపోయానని జాక్సన్ వెల్లడించాడు.. తన తండ్రి మరణం ఇప్పటికీ బాధిస్తూనే ఉంటుందని.. అతడిని నిత్యం తాను కోల్పోతూనే ఉంటానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని జాక్సన్ అనేక విధాలుగా చెప్పుకొచ్చాడు.
