Sarfaraz Khan : వాస్తవానికి ఇతడి విషయంలో అన్ని సానుకూలతలే ఉంటే ఈ కథనం రాయాల్సిన అవసరం లేదు. కానీ అతనిలో ఉన్న ఒక అవరోధం చర్చకు దారి తీసింది. అతడి స్థానాన్ని జట్టులో ప్రశ్నార్థకం చేసింది. ఫలితంగా అతడు ఆలోచించుకున్నాడు. తన తప్పు ఏంటో తెలుసుకున్నాడు. మొత్తంగా తన అవరోధాన్ని జయించి ఇప్పుడు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. కేవలం అవరోధాన్ని అధిగమించడం మాత్రమే కాదు.. బ్యాట్ ద్వారా పరుగులు తీయడంలోనూ నేర్పరితనాన్ని పెంచుకున్నాడు. నైపుణ్యానికి మరింత సాన పెట్టుకున్నాడు. త్వరలో టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించబోతున్న నేపథ్యంలో.. ఆశా కిరణం లాగా కనిపిస్తున్నాడు.
Also Read : వైభవ్ సూర్య వంశీకి ప్రీతి జింటా హగ్.. క్లారిటీ!
10 కిలోలు తగ్గాడు
గత ఏడాది న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్టులో 150 రన్స్ చేశాడు సర్ఫరాజ్. తన స్టామినా ఏమిటో నిరూపించుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అతనిపై సెలెక్టర్లు దృష్టి పెట్టారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేశారు. అయితే అతడు ఆ సిరీస్ లో రిజర్వ్ బెంచ్ కే పరిమితం కావలసి వచ్చింది. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో సర్ఫరాజ్ తన అధిక బరువు మీద దృష్టి పెట్టాడు. బ్యాటింగ్ గొప్పగానే చేస్తున్నప్పటికీ పరుగులు తీయడంలో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతడు కొన్ని నెలలపాటు తన ఆకృతిని మార్చుకునే పనిలో పడ్డాడు. ముఖ్యంగా గడిచిన నెల రోజులుగా అతడు తీవ్రంగా శ్రమించాడు. తనకు ఎంతో ఇష్టమైన బిర్యాని పక్కన పెట్టాడు. రోటిలు తినడం మానేశాడు. అన్నం తినడం పూర్తిగా తగ్గించాడు. కేవలం క్యారెట్ ముక్కలు.. కీరాముక్కలు, అవకాడో వంటి పండ్లు మాత్రమే తిన్నాడు. అసలు మాత్రమే కాదు కుటుంబం కూడా ఇదే డైట్ తినడం ప్రారంభించింది. దీంతో సర్ఫరాజ్ 10 కిలోల బరువు తగ్గాడు. ఇప్పుడు మైదానంలో వికెట్ల మధ్య అత్యంత చురుకుగా పరుగులు తీస్తున్నాడు. గ్రీన్ వెజిటేబుల్స్ మాత్రమే కాకుండా గ్రిల్డ్ చికెన్.. బాయిల్డ్ చికెన్.. గ్రిల్ ఫిష్ కూడా తినడం మొదలుపెట్టాడు. తద్వారా తన ఆకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. తనను గుర్తుపట్టలేనంత తీరుగా సన్నగా అయిపోయాడు. అంతేకాదు తన సామర్థ్యాన్ని కూడా మరింతగా పెంచుకున్నాడు.
” సర్ఫరాజ్ చాలా కష్టపడ్డాడు. మైదానంలో తీవ్రంగా శ్రమించాడు. తన ఆకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. అందువల్లే అతడు ఇప్పుడు సన్నగా మారిపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తున్నాడు. ఒక ఆటగాడికి ఇంతటి డెడికేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గొప్ప ప్లేయర్ అవుతాడని” టీమిండియా లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.. మరోవైపు ఈనెల చివరి లో ఇంగ్లాండ్ ఏ జట్టుతో జరిగే అనధికారిక టెస్ట్ సిరీస్లో భారత జట్టులో సర్ఫరాజ్ కు చోటు లభించింది.