Sarfaraz Khan: దిగ్గజ ఆటగాళ్లు అవుట్ అవుతూ.. అభిమానుల ఆశలను మొత్తం తుంచేస్తున్న సమయంలో.. అతడు మైదానంలోకి వచ్చాడు. పదుల కొద్దీ బంతులను ఎదుర్కొన్నాడు. సమయమనంతో ఆడాడు. ఒక్కో పరుగు చేసుకుంటూ ఇన్నింగ్స్ నిర్మించుకుంటూ వచ్చాడు. చివరగా టెస్ట్ క్రికెట్లో సెంచరీ చేశాడు. దానికి మరో 50 పరుగులు జోడించాడు. తద్వారా తనలో ఉన్న కళాత్మకమైన టెస్ట్ క్రికెట్ ను భారత అభిమానులకు.. యావత్ క్రికెట్ అభిమానులకు పరిచయం చేశాడు. ఇక అప్పట్లో అతని గురించి చర్చ మొదలైంది. టీమిండియాకు మరో పూజారా దొరికాడని మాజీ క్రికెటర్ల మనోగతం ద్వారా వెళ్లడైంది. అయితే ఇప్పుడు అక్కడికి టెస్టులో చోటే కరువైంది. ఆటగాడి పేరు సర్ఫరాజ్ ఖాన్.
టీమిండియా వచ్చేనెలలో ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది. 2025 -27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్లో టీం ఇండియా ఆడే తొలి టెస్ట్ సిరీస్ ఇదే. ఈ సిరీస్లో టీమిండియా ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. అందులో భాగంగానే శనివారం టీం ఇండియా మేనేజ్మెంట్ జట్టను ప్రకటించింది. గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. రిషబ్ పంత్ కు ఉప నాయకుడి అవకాశం కల్పించింది. మొత్తంగా ఇద్దరు సీనియర్ల మినహా.. మిగతా తనలకు యువ ప్లేయర్లను ఎంపిక చేసింది. వాస్తవానికి జట్టు ఎంపికలో ఒక ఆటగాడికి స్థానం లభిస్తుందని అందరూ అనుకున్నారు. ఆ ఆటగాడి పేరు సర్ఫరాజ్… కానీ అతడికి అవకాశం ఇవ్వకుండా సెలక్షన్ కమిటీ మొండిచేయి చూపించింది. ఇటీవల బి జి టి సిరీస్ లో అతడిని ఎంపిక చేసినప్పటికీ.. రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేసింది. ఇక ఇప్పుడైతే అసలు అతడిని పరిగణలోకి కూడా తీసుకోలేదు.
దేశవాళి క్రికెట్లో సర్ఫరాజ్ పరుగుల వరద పారించాడు. ముంబై జట్టు తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక గత ఏడాది ఇంగ్లీష్ జట్టు మనదేశంలో పర్యటించినప్పుడు.. టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు సర్ఫరాజ్. అప్పుడు సెంచరీలు చేయకపోయినప్పటికీ అర్థ శతకాలతో ఆకట్టుకున్నాడు. కానీ అతడు ఇప్పుడు జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అతని బరువు గతంలో అధికంగా ఉండేది. అయితే దానిని తగ్గించుకోవడానికి తీవ్రంగా కసరత్తు మొదలు పెట్టాడు సర్ఫరాజ్. ఇష్టమైన బిర్యానీని వదులుకున్నాడు. అన్నం పూర్తిగా మానేశాడు. కేవలం కూరగాయలు, సలాడ్స్ వంటి వాటినే తీసుకోవడం మొదలుపెట్టాడు. ఫలితంగా 10 కిలోల బరువు తగ్గాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడం ప్రారంభించాడు. అయినప్పటికీ అతనిని మేనేజ్మెంట్ లెక్కలోకి తీసుకోకపోవడం విశేషం. అయితే సర్ఫరాజ్ కు జరిగిన అన్యాయాన్ని కొంతమంది నెటిజన్లు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మేనేజ్మెంట్లో రాజకీయాల వల్ల ఇటువంటి ఆటగాళ్లకు అవకాశం లేకుండా పోతోందని మండిపడ్డారు.. గొప్పగా ఆడే ఆటగాళ్లను పక్కనపెట్టి.. మిగతా వారికి అవకాశాలను ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.