Sarfaraz Khan: భారత్ ఎ, ఇంగ్లండ్ లయన్స్ కు మధ్య తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ పోటపోటీగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఏ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకొని హెన్స్ ను పెవిలియన్ కు పంపాడు. ఈ క్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. శార్దూల్ ఠాకూర్ వేసిన పుల్లర్ డెలివరీని ఆఫ్ సైడ్ ఆడటానికి హైన్స్ ప్రయత్నించాడు. బంతి బ్యాట్ అంచును తాకి మొదటి స్లిప్ వైపనకు దూసుకెళ్లింది. మెరుపు వేగంతో సర్ఫరాజ్ ఖాన్ తన ఎడమవైపునకు దూకి అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. తన బరువు, ఫిట్ నెస్ పై వస్తున్న విమర్శలకు అతడు ఈ స్టన్నింగ్ క్యాచ్ ద్వారా సమాధానం ఇచ్చాడు.
— Chandra Moulee Das (@Dasthewayyy) June 1, 2025