Homeక్రీడలుక్రికెట్‌IND Vs NZ Final: అహ్మదాబాద్ లో సంజు, అభిషేక్ విధ్వంసం.. టీమిండియా వరల్డ్ రికార్డు!

IND Vs NZ Final: అహ్మదాబాద్ లో సంజు, అభిషేక్ విధ్వంసం.. టీమిండియా వరల్డ్ రికార్డు!

IND Vs NZ Final: టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు తమ విశ్వరూపం చూపిస్తున్నారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (52), సంజు శాంసన్(88*), వన్ డౌన్ ప్లేయర్ ఇషాన్ కిషన్ (54*) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ స్టోరీ రాసే సమయం వరకు టీమిండియా 14.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 203 పరుగులు చేసింది.

Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!

వాస్తవానికి ఆమదాబాద్ మైదానం టీమ్ ఇండియాకు అంత అనుకూలమైనది కాదు. ఈ మైదానంలో టీమిండియా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది. ఇక ఇటీవల టి20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా చేతిలో సూపర్ 8 మ్యాచ్ లో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహణకు వేదికగా అహ్మదాబాద్ మైదానాన్ని నిర్ణయించడం పట్ల విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో పిచ్ ను మార్చేశారు. నల్ల మట్టితో నింపేశారు. దీంతో టీమిండియా బ్యాటర్లు పండగ చేసుకున్నారు. తద్వారా టీమ్ ఇండియా స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఓపెనర్లు తొలి వికెట్ కు 43 బంతుల్లో 98 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. సంజు శాంసన్ (89), అభిషేక్ శర్మ (52) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. తొలి వికెట్ కు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ 98 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేస్తే.. సంజు శాంసన్, కిషన్ రెండో వికెట్ కు 105 పరుగులు జోడించారు.

అహ్మదాబాదులో వేగవంతంగా పరుగులు చేయడం ద్వారా టీమ్ ఇండియా ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. టి20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో టీమిండియా వేగవంతంగా వంద పరుగులు చేసింది. 7.2 ఓవర్ లోనే టీం ఇండియా ఈ ఘనత సాధించింది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టోర్నీలో కోల్ కతా వేదికగా సౌత్ ఆఫ్రికా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 7.5 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. ఇదే టోర్నీలో టీమిండియా పై ఇంగ్లాండ్ 8.1 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసింది. ఇంగ్లాండ్ పై టీమిండియా 8.3 ఓవర్లలో వంద పరుగులు చేసింది.

ఇక ఇదే మ్యాచ్లో టీమిండియా పవర్ ప్లే లో 92 పరుగులు చేసింది. 2024లో బ్రిడ్జి టౌన్ వేదికగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఒక వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. 2014లో సైలెట్ వేదికగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్ ఒక వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. 2016లో సౌత్ ఆఫ్రికాపై ఇంగ్లాండ్ మూడు వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. 2026 లో ఢిల్లీ వేదికగా నమిబియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ఫెర్గు సన్ చెత్త గణాంకాలు నమోదు చేశాడు. ఓకే ఓవర్ లో అతడు 26 పరుగులు ఇచ్చాడు. అయితే ఈ జాబితాలో ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2016లో కోల్ కతా వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నాలుగు బంతుల్లో 24 పరుగులు ఇచ్చాడు. 2024లో బ్రిడ్జ్ టౌన్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ 24 పరుగులు ఇచ్చాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular