https://oktelugu.com/

IPL trophy 2025 : ఇదయ్యా బ్రాండ్ అంటే.. ఐపీఎల్ విలువ ఎంతో తెలుసునా?

IPL trophy 2025 : బ్రాండ్.. ఒక కంపెనీ విలువను ఇదే నిర్ధారిస్తుంది. ఒక కంపెనీ భవిష్యత్తును అదే తేటతెల్లన్ చేస్తుంది. అందుకే కార్పొరేట్ కంపెనీలు బ్రాండ్ వాల్యూ కోసం పరితపిస్తుంటాయి.

Written By: , Updated On : March 27, 2025 / 04:36 PM IST
IPL trophy 2025

IPL trophy 2025

Follow us on

IPL trophy 2025 : బ్రాండ్ వ్యాల్యూ ని పెంచుకోవడానికి.. బ్రాండ్ అంటూ ఏర్పాటు చేసుకోవడానికి అనేక కంపెనీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. విశ్వసనీయతను కాపాడుకుంటాయి. విశ్వసనీయతను పెంచుకుంటాయి. ఈ క్రతువులో ఎన్నో కష్టాలను.. మరెన్నో ఇబ్బందులను.. ఇంకా ఆటుపోట్లను ఎదుర్కొంటాయి. వాటన్నింటిని అధిగమించి చివరికి బ్రాండ్ ను ఏర్పాటు చేసుకుంటాయి. కార్పొరేట్ కంపెనీల విషయాన్ని కాస్త పక్కన పెడితే.. క్రీడలలో బ్రాండ్ వాల్యూను సృష్టించుకోవడం అంత సులభం కాదు.. ఫుట్ బాల్ లో ఫిఫా, క్రికెట్లో ఐసీసీ, టెన్నిస్లో డబ్ల్యూటీసి, బ్యాడ్మింటన్ లో భాయ్.. వంటివి తిరుగులేని సంస్థలుగా ఎదుగుతున్నాయి. అయితే లీగ్ విషయానికొస్తే ఇప్పటివరకు ఫుట్ బాల్ క్రీడ పై చేయి. అనేక దేశాలలో లీగ్ లు నడుస్తున్న నేపథ్యంలో.. కొన్ని జట్లు అపరిమితమైన బ్రాండ్ వ్యాల్యూను సృష్టించుకున్నాయి. క్రికెట్లో ఐపీఎల్ తిరుగులేని బ్రాండ్ ను ఏర్పరచుకుంది.

Also Read : ఊచకోత.. పెను విధ్వంసం.. ప్రారంభంలోనే ఐపీఎల్లో రికార్డుల మోత..

2008లో మొదలై.

ప్రస్తుతం ఐపీఎల్ 18వ ఎడిషన్ సాగుతోంది. ఇప్పటివరకు 17 ఎడిషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. 2008లో మొదలైన ఐపీఎల్ ప్రారంభ సంవత్సరంలో క్రికెట్ అభిమానులకు చేరువైంది. సహజంగా మన దేశంలో క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం కాబట్టి.. తొలి సీజన్లో ఐపిఎల్ విజయవంతమైంది. ఇక 2009లో దాదాపు 17వేల కోట్ల బ్రాండ్ వ్యాల్యూను ఐపిఎల్ సొంతం చేసుకుంది. 2023 కి వచ్చేసరికి అది ఏకంగా 10 బిలియన్ డాలర్లను అందుకుంది. ఇప్పుడు 12 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2024లో 10 జట్ల మొత్తం బ్రాండ్ విలువ 13 శాతం పెరగడం వల్లే ఐపిఎల్ బ్రాండ్ విలువ ఆ మార్క్ అందుకుందని తెలుస్తోంది. ఇందులో మీడియాకు ఇస్తున్న రైట్స్ ద్వారానే 48 వేల కోట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలో క్రికెట్ లీగ్ లు ఎన్నో జరుగుతున్నాయి. ఐపీఎల్ తర్వాత ఎన్నో దేశాలు క్రికెట్ లీగ్ లు నిర్వహిస్తున్నాయి. కానీ అవన్నీ కూడా ఐపీఎల్ రేంజ్ లో హిట్ కాలేకపోతున్నాయి. పైగా ఆటగాళ్లకు కూడా విపరీతమైన డబ్బు ఐపిఎల్ ద్వారా వస్తోంది. ఈ సీజన్లో లక్నో జుట్టు కెప్టెన్ రిషబ్ పంత్ 27 కోట్లు దక్కించుకున్నాడు అంటే ఆటగాళ్లకు ఏ రేంజ్ లో సంపాదన ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం సంపాదన మాత్రమే కాదు యాడ్స్.. ఇతర వ్యవహారాలతో ఆటగాళ్లు దండిగా సంపాదిస్తున్నారు. పేరుపొందిన జట్లకు సంబంధించిన ఆటగాళ్లు తమ జాతీయ టీం లో ఆడే మ్యాచ్ల కంటే.. ఐపీఎల్ లో ఆడేందుకు ఆసక్తిని చూపిస్తున్నారంటే సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆటగాళ్లపై కనక వర్షం కురిపిస్తున్న ఐపీఎల్.. 12 బిలియన్ డాలర్ల మార్క్ అందుకోవడం.. తన బ్రాండ్ విలువను అంత పెంచుకోవడం మామూలు విషయం కాదు. 12 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఐపిఎల్ బ్రాండ్ విలువ.. వచ్చే కాలంలో 20 బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని జాతీయ మీడియా తన కథనాలలో స్పష్టం చేస్తోంది.

Also Read : పోలీసుల కనసన్నల్లో ఐపీఎల్ బెట్టింగ్?!