Prabhas
Prabhas : గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో ప్రభాస్(Rebel Star Prabhas) పెళ్లి టాపిక్ బాగా వైరల్ అయ్యింది. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురుని ఆయన పెళ్లాడబోతున్నాడని, నిన్న సోషల్ మీడియా నుండి ఎలక్ట్రానిక్ మీడియా వరకు ఒక వార్త తెగ వైరల్ గా మారింది. నేషనల్ మీడియా కూడా దీనిపై కథనాలు టెలికాస్ట్ చేసింది. విషయం ప్రభాస్ వరకు వెళ్లడంతో ఆయన తన టీం చేత వెంటనే మీడియా కి ఒక ప్రకటన విడుదల చేసాడు. ‘కొంత కాలం క్రితమే ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి పై సోషల్ మీడియా లో అనేక వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆయన పెళ్లి గురించి మీడియా లో ఒక ప్రచారం జరగడం మా దృష్టికి వచ్చింది. ప్రభాస్ ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురుని పెళ్లి చేసుకోబోతున్నాడని, పెద్దమ్మ శ్యామలాదేవి పెళ్లి పనులను చూసుకుంటుంది అంటూ సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, దయచేసి పుకార్లు నమ్మకండి’ అంటూ చెప్పుకొచ్చారు.
Also Read : ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్..ట్విస్ట్ అదిరింది కదూ!
ప్రభాస్ వయస్సు ప్రస్తుతం 45 ఏళ్ళు. ఇంత వయస్సు వచ్చినా ఆయన పెళ్లి చేసుకోకపోవడం పై సోషల్ మీడియా లో అనేక ప్రచారాలు చేస్తున్నారు. ప్రభాస్ సినీ ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయిని కానీ, వ్యాపార రంగానికి చెందిన అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోవడం లేదు. తన స్వగ్రామం అయ్యినటువంటి మొగళ్తూరు గ్రామానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రభాస్ సన్నిహితుడు రామ్ చరణ్(Global star Ram Charan) అన్ స్టాపబుల్ షో లో చెప్పాడు కూడా. అయినప్పటికీ మీడియా లో ఇష్టమొచ్చిన రాతలు రాస్తున్నారు. ప్రభాస్ పెళ్లి జరిగే వరకు ఇలాంటి రూమర్స్ కి అడ్డుకట్ట వేయడం కష్టమేనేమో. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఏ రోజు ఏ మూవీ సెట్స్ లో ఉన్నాడో చెప్పలేని పరిస్థితి.
సినిమా కోసం ఒక యంత్రం లాగా పని చేస్తున్నాడు. అందుకే పెళ్లి కి ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ప్రారంభం లో ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్'(The Raja Saab), ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్స్ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తి అయిన వెంటనే ఆయన సందీప్ వంగ తెరకెక్కించే ‘స్పిరిట్’ చిత్రానికి షిఫ్ట్ అవుతాడు. ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యే వరకు ఆయన పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితులు కనిపించడం లేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇకపోతే రాజాసాబ్ మూవీ కి సంబంధించిన విడుదల తేదీని ఉగాది కానుకగా మూవీ టీం అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే టీజర్ ని కూడా విడుదల చేయడానికి సిద్ధం గా ఉన్నారు మేకర్స్.
Also Read : వేల సంబంధాలు వచ్చిన ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే?