Sanjeev Goyanka
Sanjeev Goyanka: గెలుపు, ఓటములను ఎప్పుడూ క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలి. అప్పుడే ఒక ఆటగాడైనా, ఒక జట్టైనా విజయం సాధించగలుగుతాయి. గెలిచినప్పుడు విర్రవీగి.. ఓడినప్పుడు కుంగిపోతే ఆటకు అర్థం ఉండదు. ఆడినందుకూ అర్థం ఉండదు. అందుకే ఒక క్రీడా ఆడుతున్నప్పుడు.. గెలుపు, ఓటమి అనే విషయాన్ని పక్కనపెట్టి.. ఎంతఎఫర్ట్ చూపించామనేదే ఒక ఆటగాడికి లక్ష్యంగా ఉండాలి. ఆడిన ప్రతి మ్యాచ్లో గెలవాలి అనుకోకూడదు. ఆ గెలుపు కోసం అడ్డదారులు తప్పకూడదు.. క్రీడా స్ఫూర్తిని కలిగి ఉంటే విజయాలు వాటంతటవే వస్తాయి. క్రీడాస్పూర్తి లోపించిన నాడు ఓటములు ఎదురవుతుంటాయి.
Also Read: 29 ఏళ్లకే 600 సిక్సర్లు.. యూనివర్సల్ బాస్ రికార్డ్ బద్దలే..
డబ్బులు పెట్టింది కదా అని..
ఐపీఎల్(IPL)అనేది రిచ్ క్రికెట్ లీగ్. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. పైగా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల అధిపతులు ఐపీఎల్ లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడుల మీద లాభాలు ఆశించడం సర్వసాధారణం. అది తప్పు కూడా కాదు. కాకపోతే ప్రతి విషయంలో యాజమాన్యం రంగ ప్రవేశం చేయడం.. క్రికెటర్లపై అజమాయిషి చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందువల్లే గత ఐపీఎల్ సీజన్లో లక్నో జట్టు యజమాని సంజీవ్ గొయెంకా, కెప్టెన్ కేఎల్ రాహుల్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో ఓడిపోయింది. దీంతో మైదానంలోనే ఉన్న సంజీవ్ కేఎల్ రాహుల్ ను మందలించాడు. ఆయన తీరుకు నొచ్చుకున్న రాహుల్.. గత ఏడాది జరిగిన మెగా వేలంలో జట్టు నుంచి బయటికి వచ్చాడు. ఆ తర్వాత లక్నో యాజమాన్యం కూడా రిటైన్ చేసుకోలేదు. దీంతో అతడిని ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. సోమవారం అతడికి పాప జన్మించడంతో ఢిల్లీ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ కు అతడు దూరమయ్యాడు.
మళ్లీ మొదలుపెట్టాడు
లక్నో జట్టు యాజమని సంజీవ్ గొయెంకా(Lucknow super giants owner Sanjeev goyanka)కు ఎటువంటి క్రికెట్ నేపథ్యం లేదు. అయితే అతడికి తన జట్టు మాత్రమే విజేతగా నిలవాలనే కోరిక బలంగా ఉంటుంది. అందువల్లే ప్రతి సందర్భంలో జట్టు ఆటగాళ్లతో మమేకం అవుతుంటాడు. గెలిస్తే అభినందిస్తాడు. ఓడితే దానికి కారణం తెలుసుకుంటాడు. ఇంకోసారి అలాంటి తప్పు చేయొద్దని సూచిస్తాడు. ఇక సోమవారం జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు భారీగా పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. చివర్లో ఢిల్లీ జట్టు పై చేతులెత్తేసింది. దీంతో సంజీవ్ కు జట్టు ఆటగాళ్లు తీరుపై ఆగ్రహం వచ్చింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లకు సంజీవ్ క్లాస్ పీకడం మొదలుపెట్టాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో తెగ దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు సంజీవ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గత ఏడాది ఇలాగే క్లాసు పీకితే లక్నో జట్టు కెప్టెన్ రాహుల్ టీం ను వదిలి వెళ్ళిపోయాడని.. ఇప్పుడు ప్రారంభంలోనే ఇలా ఆటగాళ్లకు క్లాస్ పీకితే పంత్ కూడా వెళ్ళిపోతాడని వ్యాఖ్యానిస్తున్నారు.
Sanjiv Goenka in the LSG dugout. pic.twitter.com/CGMCGFm0wT
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2025