Sania Mirza: పాకిస్తాన్ ప్రముఖ క్రికెటర్ అయిన శయన్ మాలిక్ మూడో పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈయన 2010 వ సంవత్సరంలో సానియా మీర్జా ని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ల అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వీళ్ళకి ఒక బాబు కూడా జన్మించాడు.
అయితే గత కొద్ది రోజులుగా సానియా మీర్జా షోయబ్ మాలిక్ కి మధ్య చాలా గొడవలు వస్తున్నాయనే వార్తలైతే వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు వీళ్ళిద్దరూ వాటిని ఖండిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సడన్ గా సోషల్ మీడియాలో షోయబ్ మాలిక్ మూడో పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంకా షోయబ్ మాలిక్, సనా జావేద్ అనే నటిని మూడో పెళ్లి చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ 2002వ సంవత్సరంలో ఆయేషా సిద్ధికి ని పెళ్లి చేసుకున్నాడు కొద్దిరోజులకే వీళ్ళ మధ్య గొడవలు రావడం తో ఆమెకి విడాకులు ఇచ్చి, 2010వ సంవత్సరంలో సానియా మీర్జా ని పెళ్లి చేసుకున్నాడు.
వీళ్ళ పెళ్లి అయినప్పుడు కూడా చాలామంది సానియా మీర్జా ని విమర్శించారు అయినప్పటికీ వాళ్ళిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నాం అంటూ చెప్పడం తో అందరూ కామ్ అయిపోయారు. ఇక దానికి గుర్తుగా 2018 వ సంవత్సరంలో వీళ్ళకి ‘ఇజాన్ మీర్జా మాలిక్’ అనే కొడుకు పుట్టాడు. 2010లో పెళ్ళైనప్పటి నుంచి వీళ్లు దుబాయ్ లోనే ఉంటూ అక్కడే సెటిల్ అయిపోయారు. అప్పటి నుంచి ఒకరికి ఒకరు బాగా సహకరించుకుంటూ ఇద్దరు స్పోర్ట్స్ లో రాణిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా వీళ్లిద్దరూ విడిపోవడం అనేది వాళ్ళ అభిమానులను తీవ్రంగా కలిచివేస్తుంది…అయితే ఇంతకు ముందు నుంచే వీళ్ళ మధ్య గొడవలు జరగడంతో తన ట్విట్టర్ అకౌంట్ నుంచి సానియా మీర్జా పేరుని తొలగించాడు. దాంతో సానియా మీర్జా కూడా షోయబ్ మాలిక్ పేరును తొలగించింది. వీళ్ళిద్దరి మధ్య గొడవలు ముదురుతున్నాయి అని అనుకున్న సమయంలో గత ఏడాది దుబాయ్ లో వాళ్ల అబ్బాయి ఇజాన్ బర్త్ డే ఫంక్షన్ ని ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేశారు.
‘మీర్జా మాలిక్ షో’ అనే ఒక టీవీ షో ని కూడా వీళ్ళు చాలా సక్సెస్ ఫుల్ గా కండక్ట్ చేయడంతో వీళ్ళ మధ్య గొడవలు ఏమీ లేవని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యామైన ట్విస్ట్ ఇస్తు షోయబ్ వేరే పెళ్లి చేసుకోవడం పట్ల చాలామంది మాలిక్ మీద కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు. దీంతో సానియా మీర్జా తన ట్విట్టర్ అకౌంట్లో కొద్ది రోజుల క్రితం ఒక ట్వీట్ ని పోస్ట్ చేసింది. ‘కష్టమైన మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ ఫుల్ గా నిలవగలుగుతాం’ అని అర్థం వచ్చేలా ఒక పాపులర్ పోస్ట్ ని పోస్ట్ చేశారు.
జీవితం లో పెళ్లి కష్టమైనదే, విడాకులు కష్టమైనదే వీటిలో మీకు ఏది కష్టం గా అనిపిస్తే దాన్ని ఎంచుకోండి.
లావుగా ఉన్న కష్టమే ఫిట్ గా ఉన్న కష్టమే వీటిలో మీకు ఏది కష్టం గా అనిపించిందో దాన్ని ఎంచుకోండి…
అంటూ తను చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది…