India Vs England Test Series: ప్రస్తుతం ఇండియన్ టీం లో మూడు ఫార్మాట్లకు సరిపడా ప్లేయర్లు ఉండటం తో ఏ ఫార్మాట్ కి ఆడాల్సిన ప్లేయర్లు దానికే పరిమితం అవుతున్నారు. నిజానికి ఇండియన్ టీం లో ఇంతమంది ప్లేయర్లు ఉండడం ఒక రకంగా మన టీమ్ అదృష్టం అయినప్పటికీ మరొక రకంగా చూస్తే అందరు ప్లేయర్లకు టీంలో అవకాశం రాకపోవడంతో వాళ్లు కొంతవరకు నిరాశ చెందే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇప్పటివరకు అవకాశం వచ్చిన ప్రతి ప్లేయర్ కూడా తన సత్తా చాటుతూ టీం లో పాతుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక రీసెంట్ గా ఆఫ్గనిస్తాన్ తో జరిగిన టి 20 సిరీస్ లో రింకు సింగ్ తనదైన రీతిలో మ్యాచ్ లను ఆడుతూ బ్యాట్ తో అదరగొట్టాడు. అలాగే శివం దూబే కూడా ఫినిషర్ గా అద్భుతమైన పాత్రను పోషించాడు. ఇలాంటి క్రమంలో టి20 వరల్డ్ కప్ కి రింకు సింగ్, శివమ్ దూబే లను తీసుకునే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే బిసిసిఐ ఇంగ్లాండ్ లయన్స్ తో ఇండియా ఏ టీమ్ కి రెండు , మూడు అనాధికారిక టెస్ట్ మ్యాచ్ లను నిర్వహిస్తుంది. ఇక అందులో భాగంగానే మూడో టెస్ట్ మ్యాచ్ కి హైదరాబాద్ ప్లేయర్ తెలుగు తేజం అయిన తిలక్ వర్మ ని సెలెక్ట్ చేసింది.
ఇక అతనితో పాటు గా రింకు సింగ్ ని కూడా తీసుకుంది. రింకు ఇంతకుముందు మ్యాచ్ ల్లో తన సత్తా చాటుతో వస్తున్నాడు కాబట్టి అతన్ని టీం లోకి తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇక అలాగే తిలక్ వర్మ కూడా రంజి మ్యాచుల్లో హైదరాబాద్ టీమ్ ను ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి అందువల్లే తనని కూడా ఈ మ్యాచ్ లోకి సెలెక్ట్ చేశారు…
ఇక రింకు సింగ్, తిలక్ వర్మల రాకతో టీం మరింత స్ట్రాంగ్ గా తయారైందని సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వీళ్ళతో పాటుగా ఆల్ రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్ కూడా ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రతి ప్లేయర్ కూడా టి20 వరల్డ్ కప్ ని ఆడటమే ధ్యేయం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాదాపు రింకు సింగ్ టి20 వరల్డ్ కప్ ఆడే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ కూడా ఈ విషయం పైన పరోక్షంగా స్పందించారు…
ఇక ఇప్పటివరకు 15 టి 20 , రెండు వన్డేలు మాత్రమే ఆడిన రింకు సింగ్ తనదైన రీతిలో మంచి ప్రతిభను కనబరిస్తే టీమ్ లో పర్మినెంట్ ప్లేయర్ గా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి… అలాగే ఇప్పుడు ఆడుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్ ల్లో రింకు సింగ్, తిలక్ వర్మ కనక వాళ్ళ సత్తా చూపిస్తే ఇండియన్ టీమ్ ఈనెల 25వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో ఆడబోయే సిరీస్ లకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు బీసీసీఐ ఇంగ్లాండ్ తో ఆడబోయే రెండు మ్యాచ్ లకు మాత్రమే టీం ని సెలెక్ట్ చేసింది. మిగిలిన మూడు మ్యాచ్ లకి టీం ని సెలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక అందులో వీళ్ళిద్దరూ తప్పకుండా మంచి ప్లేస్ ని సంపాదించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి…
ఇక ఇండియా ఏలో మూడోవ టెస్ట్ మ్యాచ్ ఆడే ప్లేయర్లు ఎవరూ ఒకసారి మనం తెలుసుకుందాం…
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్),రజిత పటిదర్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, శామ్స్ ములానీ, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్ వంటి ప్లేయర్ల తో బరిలోకి దిగుతుంది…
ఇక ఇంగ్లాండ్ టీమ్ తో ఆడే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకి సెలెక్ట్ అయిన ఇండియన్ ప్లేయర్లు వీళ్లే…
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా వంటి ప్లేయర్లు టీమ్ లో ఉన్నారు…