Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ టీమిండియాలో ఒక లెజెండ్ మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్ లోనే అతడు ఒక అద్భుతమైన చరిత్ర. టెస్ట్ ఫార్మేట్ లో అదరగొట్టాడు. సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించాడు. వన్డేల లోనూ సత్తా చూపించాడు. అనితర సాధ్యమైన ఘనతలను అందుకున్నాడు. చివరికి t20 లలో కూడా తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడి శరీర సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అంతు పట్టకుండా ఉంటుంది. అందువల్లే అతడు రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. క్రికెట్ యవనికలో సరికొత్త ఘనతలను అందుకున్నాడు. అందువల్లే అతడి రికార్డులను బ్రేక్ చేయడం ఎవరి వల్ల కూడా కావడం లేదు. చివరికి విరాట్ లాంటి ఆటగాడికి కూడా సచిన్ నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టడం సాధ్యం కావడం లేదు. విరాట్ వీరోచితమైన బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ.. అనితర సాధ్యమైన సచిన్ టెండుల్కర్ రికార్డులను అతడు బద్దలు కొట్టలేకపోతున్నాడు.
Also Read : ఫారిన్ ప్లేయర్లు రాకుంటే ఏంటి.. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ రా అయ్యా: అయ్యర్
అరుదైన గౌరవం
క్రికెట్ చరిత్రలో సచిన్ టెండుల్కర్ ఎన్నో పురస్కారాలు అందుకున్నాడు. మరెన్నో గౌరవాలను దక్కించుకున్నాడు. చివరికి మన దేశానికి సంబంధించిన మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు భారతరత్న కూడా అతడిని వరించింది. అందువల్లే సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటగాడిగా ఇప్పటికీ వెలుగుందుతున్నాడు. అయితే అటువంటి సచిన్ టెండుల్కర్ కు బిసిసిఐ అద్భుతమైన గౌరవాన్ని అందించింది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఓ గదికి ఆయన గౌరవార్థం “SRT 100″ అని పేరు పెట్టింది. ఆ గదిని సచిన్ చేత ప్రారంభించింది.. ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణంలో అద్భుతమైన అనుభూతులను.. గొప్ప జ్ఞాపకాలను సచిన్ పంచుకున్నాడు.. బిసిసిఐ ఇప్పటికే మరొకరికి గవాస్కర్ పేరును ప్రకటించింది. వాంఖడే స్టేడియంలో స్టాండ్ కు రోహిత్ పేరును పెట్టి గౌరవించింది. ఇప్పుడు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ కూడా చేరిపోయాడు. గతంలోనే ఈ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ పేరు మీద ఒక స్టాండ్ ఉంది. ఏకంగా బీసీసీఏ ప్రధాన కార్యాలయంలో ఒక గదికి సచిన్ టెండుల్కర్ పేరును ఖరారు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం.. సచిన్ తో గదిని ప్రారంభించడం విశేషం.” ముంబై మైదానంలో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ముంబై కేంద్రంగా ఏర్పాటు చేసిన బీసీసీ ప్రధాన కార్యాలయంతో కూడా నాకు గొప్ప గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. వాస్తవానికి ఇలాంటి ఒక అవకాశాన్ని నాకు కల్పిస్తారని నేను అసలు ఊహించలేదు. ఇంతటి గౌరవం నాకు అందించినందుకు గొప్పగా ఉంది. అద్భుతంగా ఉంది. ఈ అనుభూతిని నేను మాటల్లో వర్ణించలేను. అరుదైన అవకాశాన్ని ఎలాంటి ఉపమానంతో కూడా నేను పోల్చలేను. ఇలాంటి సత్కారం నాకు దక్కినందుకు గొప్పగా భావిస్తున్నానని” సచిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు.
Also Read : విధ్వంసకారుడే ఓపెనర్.. ఐపీఎల్ రీస్టార్ట్ లో ప్రేక్షకుల ఊహకందని ఇన్నింగ్స్ ఖాయం