Engineering Marvel అది అమెరికా.. అక్కడ ఇండియనా రాష్ట్రంలోని బెల్ అనే భవనాన్ని 8 అంతస్తుల లో నిర్మించారు. అయితే ఆ భవనం బరువు 11,000 టన్నులు. ఆ భవనాన్ని అలా పక్కకు జరిపారు.. అప్పట్లో అదొక సంచలనం.. పైగా ఇంజనీరింగ్ నిపుణులు చేసిన ఆ అద్భుతం ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమైంది. పైగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అనేక మీడియా సంస్థలు ప్రముఖంగా కథనాలను ప్రచురించాయి.
అంతటి భారీ భవనాన్ని కాస్త ముందుకు జరపాలని బెల్ కంపెనీ నిర్వాహకులు భావించారు. వాస్తవానికి 1930 కాలంలో టెక్నాలజీ ఈ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అంతటి అమెరికా అయినప్పటికీ కాస్తో కూస్తో టెక్నాలజీ బెటర్ గానే ఉన్నప్పటికీ.. బిల్డింగ్ మార్చే అంత సీన్ మాత్రం అక్కడ లేదు. అయితే ఆ భవనాన్ని ఎలాగైనా మార్చాల్సిందేనని బెల్ కంపెనీ నిర్వాహకులు గట్టి పట్టుదలతో ఉన్నారు. తమ ప్రపోజల్ ను ఇంజనీరింగ్ నిపుణులకు తెలియజేశారు. అయితే మొదట్లో దానికి వారు ఒప్పుకోలేదు..బెల్ కంపెనీ నిర్వాహకులు బిల్డింగును మార్చాల్సిన ఆవశ్యకతను వివరించడంతో ఇంజనీర్లు రంగంలోకి దిగారు. ఆ తర్వాత వారు తమ పని మొదలుపెట్టారు.. అవిశ్రాంతంగా పనిచేశారు. షిఫ్టుల వారిగా సిబ్బంది రంగంలోకి దిగారు.. ఆ తర్వాత భవనం చుట్టూ ఎటువంటి గోతులు తవ్వకుండానే.. భవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండానే చూశారు. చివరికి కంపెనీ కోరుకున్నట్టుగానే భవనాన్ని రూటు మార్చారు. అయితే ఈ క్రతువులో వారు తీవ్రంగా శ్రమించారు. ఒకరకంగా అద్భుతాన్ని ఆవిష్కరించారు.
భవనాన్ని ఏం చేశారంటే..
బెల్ భవనం దాదాపు 8 అంతస్తుల్లో ఉంది. దాని బరువు 11 టన్నులు. పైగా భవన నిర్మాణంలో ఉక్కును కూడా ఉపయోగించారు. దీంతో ఇంజనీర్లు తమ బుర్రకు పని చెప్పారు. వేరే మాటకు తావు లేకుండా.. ఆ భారీ భవనం స్థానం మార్చడానికి 31 రోజుల సమయం తీసుకున్నారు. ముందుగా ఆ భవనం చుట్టుకొలతలు తీసుకున్నారు. ఆ తర్వాత మార్చాల్సిన ప్రదేశాన్ని ఒకటికి 1000 సార్లు చెక్ చేసుకున్నారు. తర్వాత పని మొదలు పెట్టారు. భవనంలో 600 మంది పనిచేస్తున్నప్పటికీ.. ఎవరికి బిల్డింగ్ కదిలినట్టు అనుమానం రాకుండా 90 డిగ్రీలు జరిపారు. నాటి రోజుల్లోనే ఈ క్రతువును మొత్తం వీడియో తీశారు. ఇక నాడు బిల్డింగ్ 90 డిగ్రీలు జరుగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
ఎందుకు జరిపారంటే..
బిల్డింగ్ ను 90 డిగ్రీలు ఎందుకు జరిపారోననే విషయంపై బెల్ కంపెనీ క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఉన్న స్థానం బెల్ కంపెనీ నిర్వాహకులకు అసలు నచ్చలేదట. అందువల్లే 90 డిగ్రీలు ముందుకు జరిపారట. ఆ తర్వాత కంపెనీ లావాదేవీలు బాగా పెరిగాయట. మనదేశంలో వాస్తు నమ్మకం అధికంగా ఉంటుంది. చివరికి అమెరికాలో కూడా అదే స్థాయిలో నమ్మకాన్ని ప్రదర్శించడం నిజంగా ఆ రోజుల్లో అద్భుతమే అని చెప్పాలి.