IPL 2025 : తుఫాన్ ప్రస్తావన.. లావా వృత్తాంతం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే.. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో మేము ప్రస్తావించే క్రికెటర్ అటువంటివాడు కాబట్టి.. అతడికి ఎలివేషన్లు అవసరం లేదు. ఎందుకంటే అతడే పెద్ద ఎలివేటర్. అంచనాలు లేకుండానే రంగంలోకి దిగుతాడు.. ఆ తర్వాత నెమ్మదిగా తన పని మొదలుపెడతాడు. ఇక ఒకసారి కుదురుకున్నాడా ఇక తిరుగు ఉండదు.. అందువల్లే అతడిని టీమిండియాలో నయా వాల్ అని పిలుస్తున్నారు. ఐపీఎల్ లో అసలు సిసలైన డైనమెట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఆటగాడు ఎవరంటే..
Also Read : బెంగళూరు vs కోల్ కతా: ఎవరు గెలుస్తారు? గూగుల్ ప్రిడిక్షన్ ఏం చెబుతోంది?
ప్రస్తుత ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ ముందు నిలిచిందంటే దానికి ప్రధాన కారణం కేఎల్ రాహుల్. వాస్తవానికి కేఎల్ రాహుల్ గత సీజన్లో లక్నో జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. కానీ అనుకోని అవాంతరాల వల్ల అతడు ఆ జట్టు నుంచి బయటికి వచ్చాడు. ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం వచ్చినప్పటికీ.. బ్యాటింగ్ మీద మనసు లగ్నం చేయాలని మేనేజ్మెంట్ కు చెప్పి.. కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పటిదాకా వన్ డౌన్ ఆటగాడిగా అతడు జట్టుకు సేవలందించాడు. ఐపీఎల్ రీస్టార్ట్ తర్వాత అతడు ఇప్పుడు ఢిల్లీ జట్టుకు ఓపెనర్ గా రాబోతున్నాడు. ఢిల్లీ జట్టుకు ఫారిన్ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడంతో.. అతడు ఓనర్ గా వస్తున్నాడు అని తెలుస్తోంది. ఇక ఐపీఎల్ లో 48.96 సగటుతో 4,260 పరుగులు చేశాడు. 100 ఇన్నింగ్స్ లలో అతడు ఈ ఘనత సృష్టించాడు. రాబోయే రోజుల్లో అతడి గనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే తిరుగు ఉండదు. అన్నట్టు ఇటీవల చిన్న స్వామి మైదానంలో బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. అనన్య సామాన్యం. పైగా అతడు గిరి గీసి థిస్ ఇస్ మై ఓన్ గ్రౌండ్ అండ్ ప్రత్యర్థి బౌలర్లకు హెచ్చరికలు జారీ చేశాడు. తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో యావత్ కన్నడ ప్రేక్షకులను మాత్రమే కాదు ఢిల్లీ అభిమానుల్ని కూడా సమ్మోహితులను చేశాడు.
ఓపెనర్ గా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ నుంచి భారీ ఇన్నింగ్స్ ను ఢిల్లీ జట్టు అంచనా వేస్తోంది.. వాస్తవానికి వన్ డౌన్ ఆటగాడిగా అతడు అద్భుతాలు సృష్టిస్తాడు. ఇప్పుడు ఏకంగా ఓపెనర్ గా వస్తున్నాడు. అంచనాలు మీ ఊహకే వదిలేస్తున్నామంటూ ఢిల్లీ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ గనక తన మరో రూపాన్ని ప్రత్యర్థి ప్లేయర్లకు పరిచయం చేస్తే ఇక తిరుగుండదని ఢిల్లీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు చరిత్రలో తొలిసారిగా ఢిల్లీ జట్టు విజేతగా ఆవిర్భవించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.