RR vs GT : గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ (82) అదరగొట్టినప్పటికీ , మరో ఓపెనర్ కెప్టెన్ గిల్(2) తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ దశలో వచ్చిన బట్లర్(36), షారుక్ ఖాన్ (36) తమ వంతు తోడ్పాటు సాయి సుదర్శన్ కు అందించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరిని సంజు శాంసన్ తనదైన చాకచక్యంతో అవుట్ చేశాడు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ను అవుట్ చేయడం ఈ మ్యాచ్ మొత్తానికి హైలెట్ గా నిలిచింది.. అప్పటికి 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో షారుక్ ఖాన్ 36 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ తో కలిసి మూడో వికెట్ కు 62 పరుగులు జోడించాడు.. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని విడదీయడానికి సంజు శాంసన్ తీక్షణ ను రంగంలోకి దింపాడు. 16 ఓవర్లో నాలుగో బంతిని ఆఫ్ సైడ్ వైపు తీక్షణ వేయగా.. దానిని భారీ షాట్ కొట్టడానికి షారుక్ ఖాన్ ప్రయత్నించాడు. దీంతో బంతి మిస్సైంది.. వెంటనే అది సంజు సాంసన్ చేతుల్లో పడింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతడు బంతితో వికెట్లను గిరాటేశాడు. దీంతో షారుక్ ఖాన్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు..
మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర..
షారుక్ ఖాన్ అవుట్ ద్వారా మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. అప్పటికి గుజరాత్ జట్టు స్కోరు 156 పరుగులు. ఈ దశలో వచ్చిన రూథర్ఫోర్డ్ (7) ఒక సిక్సర్ కొట్టి సౌకర్యవంతంగానే కనిపించినప్పటికీ.. సందీప్ శర్మ బౌలింగ్లో అనవసరపు షాట్ కు యత్నించి కీపర్ సంజు శాంసన్ చేతుల్లో చిక్కాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రషీద్ ఖాన్ (12) తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. చివర్లో రాహుల్ తేవాటియ 12 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 24* పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ జట్టు స్కోర్ 217 పరుగులకు చేరుకుంది. తుషార్ దేశ్ పాండే, తీక్షణ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. సందీప్ శర్మ, ఆర్చర్ చెరి ఒక వికెట్ సాధించారు. సంజు శాంసన్ అత్యంత తెలివిగా షారుక్ ఖాన్ ను అవుట్ చేసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఈ స్టంప్ అవుట్ ద్వారా టీమిండియా లెజెండరీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సంజు గుర్తుకు తెచ్చాడు. మెరుపు వేగంతో అతడు చేసిన స్టంప్ అవుట్ క్రికెట్ వర్గాల్లో సరికొత్త చర్చకు కారణమవుతోంది.
Also Read : చాహల్, మహ్వేష్ మధ్య నిజమే.. ఇక అదే తరువాయి..