Hari Hara Veeramallu : టాలీవుడ్ లో అత్యధిక సార్లు వాయిదా పడిన సినిమాల లిస్ట్ తీస్తే, అందులో కచ్చితంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రస్తుతం చేస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం కచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సినిమాని దాదాపుగా 11 సార్లు వాయిదా వేశారు. ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ నిర్మాత AM రత్నం ఈ చిత్రాన్ని చివరి దశకు తీసుకొచ్చాడు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ఈ రేంజ్ ఆలస్యం అయినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగిస్తూ తీసుకెళ్లడం అనేది సాధారణమైన విషయం కాదు. రత్నం కాకుండా ఆ స్థానం లో వేరే నిర్మాత ఉన్న ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ కి ఒక గొప్ప చారిత్రాత్మక విజయాన్ని అందించాలనే కసితో ఈ చిత్రాన్ని నిర్మించాడు AM రత్నం. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ క్రిష్ మధ్యలోనే వదిలి వెళ్లిపోవడం మూవీ టీం కి పెద్ద సవాల్ గా మారింది.
Also Read : ఆ విషయంలో వెనకబడ్డ పుష్ప సినిమా ప్రొడ్యూసర్స్..ఇలా అయితే కష్టమే…
అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ చిత్రం మిగిలిన భాగానికి షూటింగ్ ని చూస్తూ ఇప్పుడు చివరి దశకు తీసుకొచ్చాడు. మే9 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు తెగ కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కేవలం నాలుగు రోజుల షూటింగ్ బ్యాలన్స్ తప్ప, మిగతా మొత్తం పూర్తి అయ్యింది. ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన డబ్బింగ్ వర్క్ కూడా పూర్తి అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ రేట్ కి అమెజాన్ ప్రైమ్ సంస్థ అన్ని భాషలకు కలిపి కొనుగోలు చేసింది. వాళ్ళతో అనుకున్న డీల్ ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ లోపు విడుదల చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి పొలిటికల్ బిజీ కారణంగా ఈ సినిమా ని వాయిదా వేయాల్సి వచ్చింది.
అందుకు గాను అమెజాన్ ప్రైమ్ సంస్థకు చాలా వరకు సర్దిచెప్పుకోవాల్సి వచ్చింది నిర్మాతలు. సమ్మర్ లో విడుదల చేస్తామని మాట కూడా ఇచ్చారు. అందుకే మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ముందుగా ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ బిజీ గా ఉండడం వల్ల మే9 కి వాయిదా వేశారు. దీంతో విసిగెత్తిపోయిన అమెజాన్ ప్రైమ్ సంస్థ, మూవీ టీం కి హెచ్చరికలు జారీ చేస్తూ ఉత్తర్వులు రాసిందట. ఇప్పటికీ మీకు అనేక అవకాశాలు ఇచ్చాము, ఈ చిత్రం మే9 న విడుదల కాకపోతే ముందు అనుకున్న డీల్ 50 శాతం కి తగ్గిపోవడంతో, లేకపోతే పూర్తిగా డీల్ ని రద్దు చేసుకోవడమో జరుగుతుందని చెప్పిందట. ఒకవేళ అదే కనుక చేస్తే AM రత్నం కి భారీ నష్టాలు వస్తాయి. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ డీల్ ని రద్దు చేస్తే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కూడా కొనే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇప్పటికే వాళ్లకు ఈ ఏడాది కి సంబంధించిన స్లాట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. మే9 న సినిమా రాకపోతే ఓటీటీ సేల్ లేకుండా ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సి వస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేసే పనిలో ఉన్నారట మేకర్స్. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి రాగానే షూటింగ్ లో వచ్చే వారం పాల్గొనబోతున్నాడట.
Also Read : సోనూ సూద్ పై 1000 కోట్ల బాంబ్ వేసిన అన్వేష్