MS Dhoni : ఇప్పటివరకు ఐపీఎల్ 17 ఎడిషన్లు పూర్తయింది. అయితే ఇందులో చెన్నై జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచిందంటే.. ఆ జట్టు ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెన్నై జట్టు ఐదుసార్లు కూడా ధోని నాయకత్వంలో విజేతగా నిలిచింది. గత సీజన్ లోనే ధోని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.. గత సీజన్ నుంచి రుతు రాజ్ గైక్వాడ్ చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గత సీజన్లో చెన్నై జట్టు ప్లే ఆఫ్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఆ దశలో నిష్క్రమించింది. ఇప్పుడిక చెన్నై జట్టు ప్రస్తుతం దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లలో వరుసగా ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఒకరకంగా చెన్నై జట్టుకు ఇది అత్యంత అవమానకరమైన పరిణామం లాంటిది. ఇంతవరకు ఐపీఎల్లో చెన్నై జట్టు ఎన్నడూ కూడా ఇంత దారుణమైన ఆట తీరు ప్రదర్శించలేదు. దీనిని సగటు చెన్నై అభిమాని మాత్రమే కాదు.. చెన్నై ఆటగాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read : ధోనిని తలా అని ఊరికే అనరు.. గూస్ బంప్స్ వీడియో ఇది
పంజాబ్ జట్టుతో..
పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ధోని బ్యాట్ తో తాండవం చేశాడు. 12 బంతుల్లో 27 రన్స్ పిండుకున్నాడు. ధోని ఏకంగా ఒక ఫోర్.. మూడు సిక్సర్లు కొట్టడం విశేషం. 43 సంవత్సరాల వయసులోనూ ధోని ఇలా ఆడటం చూస్తున్న చెన్నై అభిమానులకే కాదు.. మైదానంలో ఉన్న పంజాబ్ ఆటగాళ్లకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ధోని పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు సిక్సర్లు కొట్టడం ద్వారా.. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున 252 సిక్స్ లు కొట్టి ధోని సరికొత్త చరిత్ర సృష్టించాడు . ధోని తర్వాతి స్థానంలో సురేష్ రైనా కొనసాగుతున్నాడు. సురేష్ రైనా 203 సిక్స్ లతో రెండవ స్థానంలో ఉన్నాడు. 94 సిక్స్ లతో అంబటి రాయుడు మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ధోని ఈ స్థాయిలో సిక్స్ లు కొట్టినప్పటికీ చెన్నై జట్టులో మిగతా ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా, శివం దుబే, రుతు రాజ్ గైక్వాడ్, కాన్వే వంటి వారు విఫలమవుతున్నారు. ఇలాంటి అయిదురు ఆటగాళ్లు వరుసగా విఫలం కావడం వల్లే.. చెన్నై జట్టు విజయం సాధించలేకపోతోంది. ఇలాంటి స్థితిలో ధోని ఎన్ని సిక్స్ లు కొట్టినా ఉపయోగం లేకుండా పోతోంది. ” ధోని చివర్లో వచ్చి ఆడుతున్నాడు. భారీ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై ఈసారి పంచమ శని ఉన్నట్టు కనిపిస్తోందని” చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు పేర్కొంటున్నారు.
Also Read : నా రిటర్మెంట్ పై అదే నిర్ణయిస్తుంది.. ధోని సంచలన వ్యాఖ్యలు
MS Dhoni has hit most sixes for CSK in IPL 2025
– But it also shows how bad CSK's Top 5 has been in this season. pic.twitter.com/f3A9YzBwoN
— Johns. (@CricCrazyJohns) April 9, 2025