Yajuvendra Chahal and RJ Mahvesh : పై ఉపోద్ఘాతం చాటుమాటు బంధాలను కొనసాగించే సెలబ్రిటీలకు వర్తిస్తుంటుంది. ఇప్పుడెందుకు ఇదంతా అంటే.. అక్కడిదాకా వస్తున్నాం కొద్దిసేపు ఓపిక పట్టుకోండి.. టీమిండియాలో యజువేంద్ర చాహల్(Yajuvendra Chahal) అనే స్పిన్ బౌలర్ గా ఉన్నాడు. గతంలో టీమిండియాలో తరచుగా కనిపించేవాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి.. జట్టులో స్థానాన్ని దక్కించుకోలేకపోతున్నాడు. ఐపీఎల్ లో గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan royals) జట్టుకు ఆడేవాడు. ఈసారి కింగ్స్ ఎలెవన్ పంజాబ్(kings XI Punjab) జట్టులో ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా చాహల్ కొనసాగుతున్నాడు. చాహల్ సరిగా రెండు సంవత్సరాలు క్రితం తన స్నేహితురాలు ధన శ్రీ వర్మ(dhanashri Verma)ను పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన కొద్ది సంవత్సరాల వరకు వారిద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాతే తేడాలు వచ్చేశాయి. దూరం పెరిగింది. విభేదాలు ఎక్కువ కావడంతో విడాకులు తీసుకున్నారు. మొత్తానికి కటీఫ్ చెప్పుకున్నారు. ఇప్పుడిక ధనశ్రీ వర్మ ఏం చేస్తుందో తెలియదు.. బహుశా బాలీవుడ్లో ఆమె కొరియోగ్రఫీ చేస్తోందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఇక చాహల్ విషయానికి వస్తే.. అతడు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ను సెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల టీమిండియా(IND vs NZ)దుబాయ్ లో న్యూజిలాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్(ICC Champions trophy final) లో పోటీ పడగా.. ఆ మ్యాచ్ చూసేందుకు చాహల్ వెళ్ళాడు. ఒక్కడే వెళ్తే ఇంత చర్చ ఉండేది కాదు. ఇంత ఉపోద్ఘాతం అవసరం ఉండేది కాదు. అతడు వెంట ఒక ఆడ తోడును తీసుకెళ్లాడు. దీంతో ప్రచారం మొదలైంది. మీడియా లోతుల్లోకి వెళ్ళింది. ఆ అమ్మాయి పేరు ఆర్జే మహ్వేష్. ఆర్జేగా హిందీ ప్రేక్షకులకు పరిచయమే. ఇక ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా చాహల్ కు ఆమె పరిచయమైంది. ఆ తర్వాత స్నేహం.. అధి కాస్త ప్రేమగా మారింది. దీంతో ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు.
Also Read : వదంతులు కాదు.. చాహల్ తో విడాకులు నిజమే.. ధనశ్రీ క్లారిటీ
నీ కోసం మేమున్నాం
ధన శ్రీ వర్మ కు విడాకులు ఇచ్చిన తర్వాత చాహల్ పై సోషల్ మీడియాలో ఒక సెక్షన్ నెగటివ్ ప్రచారం చేస్తోంది. ఏకంగా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తోంది. ఇది సహజంగా చాహల్ కెరియర్ కు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో అతడికి మహ్వేష్ అండగా నిలిచింది. ఇన్ స్టా గ్రామ్ లో అతడిని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ” కష్టసుఖాల్లో మనవాళ్ళ కోసం గట్టిగా ఉండాలి. అవసరమైతే బండరాయిగా అండగా ఉండాలి.. నీకోసం మేమున్నాం. మేమందరం నీకు తోడ్పాటు అందిస్తాం చాహల్” అంటూ ఆమె ఒక సెల్ఫీ ఫోటో పోస్ట్ చేసింది. నిన్న పంజాబ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తో మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా చాహల్ తో మహ్వేష్ ఒక సెల్ఫీ తీసుకుంది. ఇక మహ్వేష్ ఇన్ స్టా లో చేసిన పోస్టుకు చాహల్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ” మీరే నా వెన్నెముక.. నన్ను గొప్పగా నిలబెట్టడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. దానికి నా ధన్యవాదాలు” అంటూ చాహల్ వ్యాఖ్యానించాడు. దానికి లవ్ సింబల్ కూడా జత చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య ప్రేమ ముదిరి పాకాన పడిందని.. త్వరలో ఇద్దరూ ఒక్కటవుతారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ బంధాన్నైనా చాహల్ జాగ్రత్తగా కాపాడుకుంటాడా? లేదా? అనేది కాలమే నిర్ణయిస్తుంది.
Also Read : ధనశ్రీ తో విడాకులు.. మరో అమ్మాయితో చాహల్.. ఫోటోలు వైరల్