Rohith Sharma : ఇటువంటి దశ నుంచి ఇండియన్ క్రికెట్ పైనే కాదు, ప్రపంచ క్రికెట్ పై తనదైన ముద్ర వేశాడు రోహిత్ శర్మ. టీమిండియాలో ధోని తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు బలమైన సమాధానం చెప్పాడు. ఒకానొక దశలో ధోనిని సైతం అధిగమించే స్థాయికి వెళ్లినప్పటికీ.. అది ఆస్ట్రేలియా రూపంలో దూరమైంది. అన్నీ అనుకూలిస్తే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా పై విజయం సాధిస్తే.. రోహిత్ కు మరింత గొప్ప ఖ్యాతి వచ్చేది. అంతేకాదు, భారత క్రికెట్లోనే కాదు, ప్రపంచ క్రికెట్లోనూ అతడి కంటూ ప్రత్యేకమైన స్థానం ఉండేది. కానీ ఆ ఓటమి రోహిత్ శర్మకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. అతడు మైదానంలో కన్నీటి పర్యంతమయ్యేలా చేసింది. నేడు రోహిత్ శర్మ జన్మదినం. ఈ సందర్భంగా టీమిండియాలో అతని ప్రస్థానం గురించి ప్రత్యేక కథనం..
రోహిత్ ఆధ్వర్యంలో..
రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. రెండు ఆసియా కప్ లు సాధించింది. ఛాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ విజేతగా నిలిచింది. నిదాహస్ ట్రోఫీలో ఛాంపియన్ గా అవతరించింది. టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా సాధించినప్పుడు రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు. ఛాంపియన్ ట్రోఫీ గెలిచినప్పుడు కెప్టెన్ గా ఉన్నాడు. ఛాంపియన్స్ లీగ్ టి20 విన్నర్ అయినప్పుడు రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు. మొత్తంగా రోహిత్ శర్మ 19,700 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అతడు ఏకంగా 49 శతకాలు బాదాడు. వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో రోహిత్ ఆఫ్ సెంచరీ చేశాడు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే రోహిత్ శర్మ సాధించిన ఘనతలు ఎన్నో ఉన్నాయి. రికార్డులు కూడా ఎన్నో ఉన్నాయి. ఓడిపోయినప్పుడు కృంగిపోయాడు. గెలిచినప్పుడు సందడి చేశాడు. ప్రతి సందర్భంలోనూ తన ఉద్వేగాన్ని ప్రదర్శించాడు. అంతేతప్ప లోపల బాధను పెట్టుకుని.. లోపల ఆనందాన్ని దాచుకొని.. బయటికి మాత్రం నటించలేదు. ఎందుకంటే అతడు రోహిత్ శర్మ కాబట్టి.. అతడి నాయకత్వంలో అనితర సాధ్యమైన ప్రదర్శన చేసింది.. ఐసీసీ నిర్వహించిన వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వెళ్ళింది.. టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా టోర్నీలలో టీమిండియాను ఫైనల్ దాకా తీసుకెళ్లిన ఘనత ను టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ దక్కించుకున్నాడు. మూడుసార్లు ఫైనల్ వెళ్లిన సందర్భంలో.. ఒకే ఒక్కసారి టీమ్ ఇండియా ఓడిపోయింది. వన్స్ అగైన్ ఓకే తెలుగు తరఫునుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు జన్మదిన శుభాకాంక్షలు.
Also Read : రోహిత్ అంటే అట్లుంటది మరి.. పరాయి జట్టు సభ్యుడు ఆకాశానికి ఎత్తేశాడుగా!