Rohit Sharma: పై ఉపోద్ఘాతంలో అవన్నీ అందించడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుంటాడు. ఏమాత్రం భయం అనేది అతనికి తెలియదు. బెదురు అనేది అతని ఒంటికి నప్పదు. బౌలర్ ఎవరైనా సరే దూకుడే అతడి మంత్రం. బీభత్సమే అతడి సిసలైన తంత్రం. కొన్నిసార్లు అతడు విఫలం కావచ్చు. కానీ అప్పుడు కూడా ప్రేక్షకులకు ఏదో చెప్పే వెళ్తుంటాడు. అతడు బీభత్సంగా ఆడిన ఇన్నింగ్స్ లో ఏదో గొప్పతనం ఉంటుంది. అతడు విఫలమైన ఇన్నింగ్స్ లో తెలుసుకోవాల్సిన పాఠం ఉంటుంది. మొత్తానికి అతడు నిలువెత్తు లెజెండ్. క్రికెట్లో ఈ కాలపు ట్రెండ్ సెట్టర్. అందుగురించే అతడికి జీరో హేటర్స్ ఉంటారు. అతడిలా ఆడాలని.. ఆట కోసం అతడిలాగా తాపత్రయపడాలని.. ఆటలో అతడిలాగా నైపుణ్యం సాధించాలని చాలామంది కలలు కంటారు. అందులో కొంతమంది మాత్రం వాటిని సాకారం చేసుకుంటారు. తమకు అవకాశం వచ్చినప్పుడు రోహిత్ గురించి గొప్పగా చెబుతుంటారు. ఇప్పుడు ఈ జాబితాలో చెన్నై జట్టుకు చెందిన సపోర్ట్ స్టాఫ్ నెంబర్ ఉన్నారు.
Also Read: ఇది ఐపీఎల్లా? మిస్ యూనివర్స్ పోటీనా? మతులు పోతున్నాయి రా బాబూ!
ఏం వ్యాఖ్యానించాడంటే
ఐపీఎల్ లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్లేయర్స్ జాబితాలో రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటాడు. ప్రత్యర్థి జట్ల కోచింగ్ స్టాఫ్ కూడా రోహిత్ శర్మను విపరీతంగా ఆరాధిస్తుంటారు.. కొన్ని సందర్భాల్లో రోహిత్ మాదిరిగా ఆడాలని తమ జట్టు ప్లేయర్లకు సూచిస్తుంటారు. రోహిత్ ఆడిన సూపర్ ఇన్నింగ్స్ వీడియోలను చూపిస్తుంటారు. ఇక చెన్నై జట్టుతో ముంబై ఆదివారం తలపడునుంది. ఇప్పటికే ముంబై ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో చెన్నై జట్టు సపోర్ట్ స్టాఫ్ మెంబర్ ఒకరు రోహిత్ శర్మని కలిశారు. ఆ సందర్భాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ” ఎదుటి మనిషిని గౌరవించడం అనేది గొప్పది. అది పాపులారిటీ కంటే కూడా పెద్దది.. రోహిత్ శర్మను కలిసినప్పుడు నాకు ఇలాంటి అనుభవం ఎదురయిందని” అతను రాస్కొచ్చాడు. ఈ లెక్కన చూస్తే రోహిత్ శర్మ ఆ వ్యక్తికి ఎంతో గౌరవం ఇచ్చాడని..అతడు నీ దగ్గరికి తీసుకొని చాలా విషయాలు చెప్పాడని.. తెలుస్తోంది. ఇక ఇటీవల ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మను అక్కడి అభిమానులు కలిశారు. వారందరికీ కూడా ఎంతో ఓపిక రోహిత్ ఆటోగ్రాఫ్ లు ఇచ్చాడు. వారితో సెల్ఫీలు కూడా దిగాడు. ఇప్పుడు చెన్నై జట్టు సపోర్టింగ్ స్టాఫ్ తో కూడా అలాగే వ్యవహరించాడు రోహిత్. మొత్తంగా వ్యక్తిత్వంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. రోహిత్ శర్మ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.. ఎంతైనా రోహిత్ శర్మ డౌన్ టు ఎర్త్ అని నెటిజన్లు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.
CSK Support staff member about Rohit Sharma pic.twitter.com/UUIYgK9Tb5
— Johns. (@CricCrazyJohns) April 26, 2025