Rohit Sharma : ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. తద్వారా ఐపీఎల్లో చెన్నై సరసన కొనసాగుతోంది ముంబై. ముంబై జట్టు అన్నిసార్లు ఐపీఎల్ విజేతగా నిలవడం వెనుక రోహిత్ శర్మ ఉన్నాడు. అతని నాయకత్వంలో ముంబై ఇండియన్స్ తిరుగులేని విజయాలు అందుకుంది. ఐపీఎల్ లో ఏక ఛత్రాధిపత్యాన్ని కొనసాగించింది. అయితే అటువంటి కెప్టెన్ ను ముంబై ఇండియన్స్ వదులుకుంది. గత సీజన్ నుంచి కెప్టెన్ గా అతడిని పక్కనపెట్టి.. అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇచ్చింది. హార్థిక్ పాండ్యా నాయకత్వం లో గత సీజన్లో ముంబై జట్టు గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్ళిపోయింది. ఈ సీజన్లో మాత్రం తొలుత ఓటములు ఎదుర్కొన్నప్పటికీ.. ఆ తర్వాత వరుస విజయాలతో టాప్ -3 స్థానంలో కొనసాగుతోంది.
Also Read : రోహిత్ శర్మ..ఓవర్ నైట్ కెప్టెన్ కాదు.. దాని వెనుక జీవితానికి మించిన కష్టం.. గూస్ బంప్స్ వీడియో ఇది
డీపీ కి తక్కువేం లేదు
బుధవారం జన్మదినం జరుపుకుంటున్న రోహిత్ శర్మ కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక సోషల్ మీడియాలో వినూత్నంగా అతని పేరు మీద డిస్ ప్లే పిక్చర్ రూపొందించింది.. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జన్మదిన శుభాకాంక్షలు రోహిత్ శర్మ అనే యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నది. ఇంతవరకు బాగానే ఉంది గాని.. వాస్తవానికి ముంబై ఇండియన్స్ జట్టు నుంచి అతని కెప్టెన్ గా ఎందుకు తొలగించిందో మాత్రం ఇంతవరకు.. ఆ జట్టు యాజమాన్యం బయటికి చెప్పడం లేదు.. వాస్తవానికి ముంబై జట్టు ఆటగాళ్లతో రోహిత్ శర్మకు ఎటువంటి విభేదాలు లేవు. పైగా ఏ ఆటగాడి పై కూడా అతడు పక్షపాతం చూపించడు. మైదానంలో సరిగా ఆడకపోతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా. ఆ తర్వాత దానిని అక్కడితోనే మర్చిపోతాడు. ఈ ఒక్క ఆటగాడిపై ప్రత్యేక అభిమానాన్ని చూపించడు. గొప్పగా ఆడితే అవకాశాలు ఇస్తాడు. ఆడకపోతే అతడి స్థానంలో కొత్త వాళ్లను నియమించుకుంటాడు. కానీ రోహిత్ శర్మను కారణం లేకుండా ముంబై జట్టు యాజమాన్యం కెప్టెన్ స్థానం నుంచి పక్కనపెట్టింది. ఆ స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది. అయినప్పటికీ రోహిత్ తన ఆటతీరు మార్చుకోలేదు. తన ఆట తీరుపై విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఇక ఇటీవల హైదరాబాద్, లక్నో జట్లతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ వీర విహారం చేశాడు. తనకు మాత్రమే సాధ్యమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ముంబై జట్టును గెలిపించాడు. తద్వారా తనకు ముంబై జట్టుకు ఉన్న సంబంధాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. కాకపోతే ముంబై జట్టు కెప్టెన్ గా రోహిత్ ను ఎందుకు తొలగించారనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ ప్రశ్నకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం సమాధానం చెప్పలేదు. రోహిత్ శర్మ సమాధానం చెప్పాలి అనుకోడు.
Also Read : గిల్ ఆడితే బాగుండనుకున్నా.. కానీ.. సిడ్ని టెస్ట్ పై రోహిత్ సంచలన వ్యాఖ్యలు