IND Vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా – న్యూజిలాండ్(IND vs NZ) ఫైనల్ మ్యాచ్లో దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ షాంట్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్పిన్ కు సహకరించే మైదానంపై అతడు బ్యాటింగ్ ఎంచుకోవడం ఒక రకంగా ఇబ్బందికర నిర్ణయం అనిపించింది. దానిని నిజం చేసేలాగా టీమిండియా స్పిన్ బౌలర్లు బౌలింగ్ వేశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగుతోంది.
Also Read: నా ప్రేమ నిజమైతే..నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలి అంటూ యాంకర్ రష్మీ ఎమోషనల్ కామెంట్స్!
36 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో మిచెల్(41), ఫిలిప్స్(28) ఉన్నారు. ఐదో వికెట్ కు ఇప్పటివరకు వీరు 48 పరుగులు జోడించారు. రచిన్ రవీంద్ర (37) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కులదీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో వికెట్ సాధించారు. స్పిన్ బౌలింగ్ కు సహకరించే ఈ మైదానంపై న్యూజిలాండ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం.
12 సార్లు టాస్ ఓడిపోయాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఈ మ్యాచ్లో కూడా టాస్ ఓడిపోయాడు. నవంబర్ 2023 నుంచి మార్చి 2025 వరకు రోహిత్ శర్మ 12 మ్యాచ్లలో టాసులు వరుసగా ఓడిపోయాడు. వెస్టిండీస్ కెప్టెన్ గా బ్రియాన్ లారా ఉన్నప్పుడు అతని కూడా అక్టోబర్ 1998 నుంచి 1999 మే వరకు వరుసగా 12సార్లు టాస్ ఓడిపోయాడు. ఇక నెదర్లాండ్ జట్టు కెప్టెన్ పీటర్ బొర్రెన్ మార్చి 2011 నుంచి ఆగస్టు 213 వరకు 11 మ్యాచ్లలో టాస్ ఓడిపోయాడు. ఏకంగా 12 మ్యాచ్లలో వరుసగా టాస్ ఓడిపోయి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్రియాన్ లారా సరసన చేరాడు. టీమిండియా కెప్టెన్ టాస్ ఓడిపోవడంతో.. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఐదు మ్యాచ్లలో టాస్ ఓడిపోయాడు. బంగ్లాదేశ్,.. పాకిస్తాన్ జట్టుపై టాస్ ఓడిపోయి ముందుగానే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఆ మ్యాచులలో భారత్ విజయం సాధించింది. ఇక న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆ మ్యాచ్ లోనూ రోహిత్ సేన గెలిచింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిపోయిన టీమ్ ఇండియా ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లోనూ టీమిండియా ఘన విజయం సాధించి ఫైనల్ వెళ్ళింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ టాస్ ఓడిపోయాడు. న్యూజిలాండ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే 2023 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. ఆ మ్యాచ్లో టీమ్ ఇండియాకు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది.. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా రోహిత్ టాస్ ఓడిపోతూనే ఉన్నాడు.