Photo Story: అభిమానులు కూడా తమకు బాగా ఇష్టమైన హీరోలు లేదా హీరోయిన్లకు సంబంధించిన అరుదైన ఫోటోలను చూడడానికి చాలా ఆసక్తిని చూపిస్తారు. తమకు ఇష్టమైన హీరోల కోసం సామాజిక మాధ్యమాల్లో కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ పేజ్ లను కూడా క్రియేట్ చేస్తారు.సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన అరుదైన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉంటారు. చాలామంది సోషల్ మీడియాలో తమ ఇష్టమైన హీరోలు మరియు హీరోయిన్ల కోసం ప్రత్యేకమైన పేజ్ లను క్రియేట్ చేసి ఫోటోలను, వీడియోలను పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఒక స్టార్ హీరో అరుదైన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఈ తమిళ స్టార్ హీరో తెలుగు వాళ్లకి కూడా బాగా పరిచయం. ఈ స్టార్ హీరో ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. తను నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తమిళ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతను తెలుగులో కూడా సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను కూడా తన వైపు తిప్పుకున్నాడు. తమిళ్ తో పాటు ఇతనికి తెలుగులో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది. ఇతను మరెవరో కాదు తమిళ్ స్టార్ హీరో జీవా. హీరో జీవా గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Also Read: ‘క’ మూవీ క్లైమాక్స్ ని మార్చమని ఆ ఓటీటీ సంస్థ అంత ఒత్తిడి చేసిందా..? చివరికి ఏమైందంటే!
జీవా నటించిన సినిమాలు అన్ని తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయం సాధించాయి.అయితే ఇతను అతి చిన్న వయసులోనే రెండు సినిమాలలో గెస్ట్ రోల్ లో నటించిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. జీవ తండ్రి పేరు ఆర్.బి చౌదరి. 1991లో కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన చరణ్ పాండియన్ సినిమాలో జీవా కనిపించాడు. జీవ తండ్రి ఆర్బి చౌదరి తెలుగు నిర్మాతగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. తండ్రి తెలుగు నిర్మాత అయినప్పటికీ జీవా తమిళ స్టార్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.
View this post on Instagram
2003లో రిలీజ్ అయిన ఆసే ఆసే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జీవ హీరోగా నటించిన రంగం సినిమా తెలుగులో కూడా భారీ విజయం సొంతం చేసుకుంది. ఇతను నటించిన సినిమాలు అన్నీ కూడా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించాయి. ఇటీవలే జీవా జగన్ బయోపిక్ అయిన యాత్ర 2 లో నటించాడు.
Also Read: నా ప్రేమ నిజమైతే..నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలి అంటూ యాంకర్ రష్మీ ఎమోషనల్ కామెంట్స్!