Rashmi Gautam : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రష్మీ(Rashmi Gautam). రేడియో జాకీ గా కెరీర్ ని ప్రారంభించిన ఈమె, స్టార్ మా ఛానల్ లో అప్పట్లో ప్రసారమైన ‘యువ’ అనే సీరియల్ ద్వారా మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చింది కానీ, అవేమి ఆమెకు అంత పేరు తీసుకొని రాలేదు. ఎప్పుడైతే ఆమె జబర్దస్త్ షో కి యాంకర్ గా వ్యవవహరించడం మొదలు పెట్టిందో, అప్పటి నుండి ఆమె జాతకం మారిపోయింది. అప్పట్లో జబర్దస్త్ చూసే ఆడియన్స్ అందరూ ఎవరీ అమ్మాయి ఇంత అందంగా ఉంది?, ఎక్కడి నుండి తీసుకొచ్చారు అని అనుకునేవారు. ఆ రేంజ్ లో మన ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన రష్మీ, ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారమయ్యే అన్ని ఎంటర్టైన్మెంట్స్ షోస్ లో యాంకర్ గా వ్యవహరించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.
Also Read : ఆసుపత్రి పాలైన ప్రముఖ యాంకర్ రష్మీ..వైరల్ అవుతున్న ఫోటోలు..విచారం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..అసలు ఏమైందంటే!
జబర్దస్త్ షో ఇప్పటికీ ప్రతీ శుక్రవారం, శనివారలలో టెలికాస్ట్ అవుతూనే ఉంది. ఈ షోలో మొదటి నుండి ఉన్నోల్లందరూ ఇప్పుడు వెళ్లిపోయారు. కానీ రష్మీ మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ షోకి యాంకర్ గా కొనసాగుతూనే ఉంది. అంతే కాకుండా ప్రతీ ఆదివారం మధ్యాహ్నం టెలికాస్ట్ అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది. బుల్లితెర ద్వారా సంపాదించుకున్న క్రేజ్ తో ఈమె సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇదంతా పక్కన పెడితే రష్మీ, సుధీర్(Sudigaali Sudheer) ఈ రెండు పేర్లను వేర్వేరుగా చూడలేము. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బ్లాక్ బస్టర్, కేవలం ఈ జోడి కెమిస్ట్రీ ని చూడడం కోసమే జబర్దస్త్, ఢీ షోస్ వంటివి అప్పట్లో చూసేవారు ఆడియన్స్. ఆ రేంజ్ క్రేజ్ ని దక్కించుకుంది ఈ జంట.
అయితే మేము అది కేవలం వినోదం కోసమే చేశామని, మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, కేవలం మేము మంచి స్నేహితులం మాత్రమే అని ఇరువురు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు కానీ, జనాలు మాత్రం వీళ్ళ మాటలను నమ్మడం లేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా రష్మీ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది. నీ ప్రేమని పంచేందుకు మరోసారి పుట్టవా అంటూ ఆమె ఎంతో ఎమోషనల్ గా వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎన్నో ఏళ్ళ నుండి ఈమె ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క ఇటీవలే చనిపోయిందట. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ పెడుతూ ‘నిన్ను మళ్ళీ ప్రేమించే అవకాశం కోసం, జీవితాంతం ఇక నుండి నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. పునర్జన్మ అనేది నిజంగా ఉంటే, నువ్వు పుట్టి మళ్ళీ నా దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను’ అంటూ రష్మీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : ఎన్నాళ్లకెన్నాళ్లకు రష్మీ-సుధీర్ ఆ హగ్గులు, రోమాన్స్ చూస్తే తట్టుకోలేం.. వైరల్ అవుతున్న వీడియో!