Siri Hanumanth: జబర్దస్త్ కామెడీ షో అనగానే మనకు రష్మీ గౌతమ్, అనసూయ గుర్తుకు వస్తారు. మధ్యలో ఒకరిద్దరు వచ్చినా నిలబడలేదు. బిగ్ బాస్ సీజన్ 5 ఫేమ్ సిరి హన్మంత్ కొన్నాళ్ళు యాంకరింగ్ చేసింది. సడన్ గా షో నుండి మాయమైంది. ఆమె జబర్దస్త్ కి దూరం కావడానికి కారణం ఏమిటో సిరి హన్మంత్ ఓ సందర్భంలో వెల్లడించింది.
Also Read: నా ప్రేమ నిజమైతే..నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావాలి అంటూ యాంకర్ రష్మీ ఎమోషనల్ కామెంట్స్!
హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ లకు అవకాశం రాలేదు. దాంతో జబర్దస్త్ యాంకర్స్ గా మారారు. 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ మొదలైంది. రోజా, నాగబాబు జడ్జెస్, యాంకర్ గా అనసూయ పరిచయమైంది. షో గ్రాండ్ సక్సెస్. అనసూయ తెలుగు బుల్లితెరపై గ్లామర్ షో చేసిన మొదటి యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఆమె స్కిన్ షోపై విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తిగత కారణాలతో అనసూయ జబర్దస్త్ మానేసింది. ఆమె స్థానంలోకి రష్మీ వచ్చింది. రష్మీ వచ్చాక షోకి మరింత ఆదరణ దక్కింది.
దాంతో ఎక్సట్రా జబర్దస్త్ స్టార్ట్ చేశారు. దాంతో అనసూయ రీ ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ గౌతమ్ యాంకర్స్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ షో తెచ్చిన పాపులారిటీ వాళ్లకు సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ తెచ్చిపెటింది. రష్మీ గౌతమ్ పలు చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. అనసూయ లీడ్ రోల్స్ తో పాటు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తుంది. 2022లో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. ఆమె స్థానంలో ఎవరు వస్తారనే ఉత్కంఠ నడిచింది.
ఎందరో పోటీ పడినప్పటికీ ఆ ఛాన్స్ కన్నడ సీరియల్ నటి సౌమ్యరావుకు దక్కింది. ఆమె ఏడాదికి పైగా షోలో ఉంది. ఆమెను షో నుండి తప్పించారు. అప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ యాంకర్ గా వచ్చింది. సిరి హన్మంత్ కి ఉన్న గ్లామరస్ ఫేమ్ రీత్యా ఆమె సక్సెస్ అవుతుందని భావించారు. కానీ సిరి హన్మంత్ జర్నీ సైతం త్వరగానే ముగిసింది. ఓ ఇంటర్వ్యూలో జబర్దస్త్ నుండి తప్పుకోవడం పై ఆమె స్పందించారు.
జబర్దస్త్ నేను మానేయలేను. వారే తప్పించారు. కారణం ఏమిటని నేను అడిగాను. ఇకపై రెండు షోలు ఉండవు. ఒకటే ఉంటుంది. అందుకే మిమ్మల్ని తీసేయాల్సి వచ్చింది అని చెప్పారని.. సిరి హన్మంత్ ఉన్నారు. ఆరంభంలో ఉన్న అనసూయతో పాటు మధ్యలో వచ్చిన సౌమ్యరావు, సిరి హన్మంత్ కూడా జబర్దస్త్ లో లేకుండా పోయారు. ఒక్క రష్మీ మాత్రం పాతుకుపోయింది. ఎక్స్ట్రా జబర్దస్త్ పేరును తొలగించి జబర్దస్త్ పేరుతో వారానికి రెండు ఎపిసోడ్స్ ప్రసారం చేస్తున్నారు. రష్మీ యాంకర్ గా ఉంది.