spot_img
Homeక్రీడలుHardik Pandya: రోహిత్ ఔట్.. హార్ధిక్ కెప్టెన్.. షాకిచ్చిన ముంబై ఇండియన్స్..?

Hardik Pandya: రోహిత్ ఔట్.. హార్ధిక్ కెప్టెన్.. షాకిచ్చిన ముంబై ఇండియన్స్..?

Hardik Pandya: ఇక వన్డే వరల్డ్ కప్ ముగిసింది వెంటనే అందరు ఐపీఎల్ కోసం సిద్దం అవుతున్నారు.ఇక అందులో భాగంగానే ఐపీఎల్ లో ఉన్న అన్ని జట్లు కూడా సిద్దం అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఐపీఎల్ లో ఏ టీమ్ ఏ ప్లేయర్ ని ఉంచుకోవాలి ఏ ప్లేయర్ ని రిలీజ్ చేయాలి అనే దాని పైననే ప్రస్తుతం విపరీతమైన చర్చ నడుస్తుంది.ఇక డిసెంబర్ 19 న మినీ యాక్షన్ ఉండటం తో ప్రతి టీమ్ కూడా వాళ్ల టీమ్ నుంచి రిలీజ్ చేసే ప్లేయర్ల పేర్ల ని ఈనెల 26 లోగా ఫైనల్ చేసి ఐపీఎల్ పాలక మండలికి అందజేయాల్సి ఉంటుంది…

ఇక గత ఐపిఎల్ లో చాలా డబ్బులు పెట్టీ కొన్న ఏ ప్లేయర్ కూడా వాళ్ల సామర్థ్యం మేరకు రానించలేకపోయారు. ఇక దాంతో ఇప్పుడు ఆ ప్లేయర్లందరిని వదిలేసి వేరే ప్లేయర్ల ను తీసుకోవాలని ఆ టీమ్ ప్రాంచైజర్లు చూస్తున్నారు…గత ఏడాది అత్యధిక ధర పలికిన సామ్ కరణ్ (18.50 కోట్లు) ను పంజాబ్ జట్టు వదిలించుకోవాలని చూస్తుంది.అలాగే మరో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ అయిన బెన్ స్టోక్స్(16.25 కోట్లు) ని పెట్టీ కొనుకున్న చెన్నై టీమ్ కూడా అతన్ని వదిలేయాలని చూస్తుంది…

ఇక ఇప్పుడు మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే జోఫ్రా ఆర్చర్ ప్లేస్ లో ముంబై టీమ్ లోకి హార్దిక్ పాండ్య వస్తున్నాడు అంటూ చర్చలు నడుస్తున్నాయి. అయితే ముంబై టీమ్ లో ఉన్న రోహిత్ మాత్రం గుజరాత్ టీమ్ లోకి వెళ్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి.కానీ రోహిత్ ని ముంబై వదులుకునే ప్రసక్తి లేదు అంటూ మరి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి…ఇక హైద్రాబాద్ టీమ్ హరీ బ్రూక్స్ ని వదిలేసి వేరే ప్లేయర్లను తీసుకోవాలని చూస్తున్నారు…ఇక కలకత్తా అయితే రసెల్, సునీల్ నరైన్ లను తీసివేసి ముందుకు వెళ్ళాలని చూస్తుంది…ఇక ఆ టీమ్ లో ఉన్న పేసర్స్ అయిన శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఫెర్గూసన్‌, సౌథీ, షకీబ్‌, లిట్టన్‌ దాస్‌, డేవిడ్‌ వీస్‌ లాంటి వాళ్ళని వదిలేయాలని చూస్తుంది….ఇక మొన్న వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా టీమ్ తరుపున సత్తా చాటిన ట్రావిస్ హెడ్ ని కానీ లేదా ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ టీమ్ నుంచి ఆల్ రౌండర్ షో కనబరిచిన రచిన్ రవీంద్ర ని కానీ టీమ్ లోకి తీసుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…

అయితే ఈసారి వేలం లోకి చాలా మంది యంగ్ ప్లేయర్స్ రానున్నట్టు గా తెలుస్తుంది ముఖ్యంగా మొన్న వరల్డ్ కప్ లో సత్తా చాటిన అఫ్గాన్ ప్లేయర్ల కోసం కూడా పోటీ నడిచే అవకాశం ఉంది.ఎందుకంటే వాళ్ళు అయితే తక్కువ లో వస్తారు మళ్ళీ మంచి ప్రతిభ కనబరుస్తారు కాబట్టి వాళ్ల మీద కూడా పోటీ భారీ గానే ఉండేలా కనిపిస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version