spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: బాబు క్వాష్ పిటిషన్ ఏమైంది?

Chandrababu: బాబు క్వాష్ పిటిషన్ ఏమైంది?

Chandrababu: స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. సుదీర్ఘకాలం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు. ఎట్టకేలకు ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించింది. అంతవరకు పరవాలేదు కానీ.. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు ఏమైంది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు కోర్టు ఎందుకు జాప్యం చేస్తోంది? తీర్పు ఎందుకు వెల్లడించడం లేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెర వెనుక ఏం జరుగుతోందన్న చర్చ నడుస్తోంది.

అసలు చంద్రబాబును అరెస్టు చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఒకవేళ చేసినా రిమాండ్ విధిస్తారని భావించలేదు. కానీ అరెస్టుతో పాటు రిమాండ్ జరిగిపోయింది. సుదీర్ఘకాలం జైల్లో ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఈ కేసులో చంద్రబాబు ఎక్కడ బెయిల్ కు ప్రయత్నించలేదు. తనపై కేసుల నమోదు విషయంలో నిబంధనలు పాటించలేదని.. గవర్నర్ అనుమతి తీసుకోలేదని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. చట్ట విరుద్ధమని.. అసలు సాక్షాధారాలే లేవని.. అందుకే ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఏసిబి, తర్వాత హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టులో కేసులు కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ తో పాటు హైకోర్టులో ఈ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. సుప్రీంకోర్టులో మాత్రం విచారణకు వచ్చింది. కానీ సుదీర్ఘకాలం అవుతున్న తీర్పు మాత్రం వెల్లడి కాలేదు.

అక్టోబర్ 17న కేసులో వాదనలు ముగిశాయి. అక్టోబర్ 20 కి వాయిదా పడింది. ఆరోజు కూడా తీర్పు వెల్లడించలేదు. అనంతరం దసరా సెలవులు అంటూ వాయిదాలు కొనసాగాయి. అదిగో తీర్పు.. ఇదిగో తీర్పు అంటూ కాలయాపన కొనసాగింది. తీర్పు మాత్రం వెల్లడించలేదు. ఇంతలో అనారోగ్య కారణాలు చూపుతూ చంద్రబాబు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీంతో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 28 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇంతలో రెగ్యులర్ బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. అటు ఫైబర్ నెట్ కేసు విషయంలో సైతం.. స్కిల్ స్కాంలో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ కు జత చేశారు.. దీనిపై ఎప్పుడు తీర్పు వస్తుందో చూడాలి. క్వాష్ పై హడావిడి చేసిన టిడిపి శ్రేణులు.. ఇప్పుడు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో కనీసం పట్టించుకోవడం లేదు. అసలు ఏమైందని ఆరా తీసే పని కూడా చేయడం లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version