Kushboo: తెలుగు ప్రేక్షకులకు కుష్బూ పేరు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాప్ హీరోయిన్ ల లిస్టులో ఉండేది. ఇప్పుడు కూడా ఆమె ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కానీ మెయిన్ రోల్స్ చేస్తూ తన సత్తా చాటుతుంటుంది కుష్బూ. 1986లో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. అదే సంవత్సరం కెప్టెన్ నాగార్జున సినిమాలో నటించింది. కెరీర్ స్టార్టింగ్ లోనే నాగార్జున వెంకీలతో స్క్రీన్ షేర్ చేసుకొని వావ్ అనిపించుకుంది కుష్బూ. తర్వాత ఆమె స్టార్ హీరోలతో కలిసి నటించలేదు.
1993లో మళ్లీ పేకాట పాపారావు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. ఇక రీసెంట్ గా ఆడాళ్లు మీకు జోహార్లు, రామబాణం సినిమాల్లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే బుల్లితెరపై సందడి చేస్తుంటుంది కుష్బూ. అదే విధంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో ప్రస్తుతం జడ్జిగా కొనసాగుతోంది. ఈమె అందంగా ఉండడమే కాకుండా బాగా మాట్లాడుతుంది కూడా. ముఖ్యంగా ఇంగ్లీష్ ఇరగదీస్తుంటుంది. అయితే ఈమె ఇంగ్లీష్ ను చూసి బాగా ఎడ్యుకేటెడ్ అనుకుంటారు. కానీ తన చదువు గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కుష్బూ.
9వ తరగతి తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశానని కుష్బూ చెప్పింది. అయితే అంత తక్కువ చదువుకున్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంత ఫ్లూయెంట్ గా ఎలా మాట్లాడుతున్నారు అంటూ ఓ సారి ప్రశ్న ఎదురైంది. దానికి బదులిస్తూ.. ఇద్దరు హీరోల వల్ల నేను బాగా ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను అంటూ తెలిపింది. నా ఫస్ట్ హీరో వెంకటేషన్ వల్ల నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. ఆ తర్వాత నాగార్జున కారణంగా మరింత ఎక్కువ నేర్చుకున్నాను అని గుర్తు చేసుకుంది. నా ఫస్ట్ సినిమా వెంకటేష్ తో, సెకండ్ సినిమా నాగార్జునతో చేయడం వల్ల ఇంగ్లీష్ వచ్చిందని తెలిపింది.
ఈ ఇద్దరు హీరోలు కూడా అప్పుడే అమెరికా నుంచి వచ్చారని.. ఆ సమయంలో నాకు పెద్దగా ఇంగ్లీష్ రాకపోయేదని.. దాంతో నేను భారతీయ భాషల్లో మాట్లాడేదాన్నని.. తెలిపింది. అయితే కుష్బూను ఇంగ్లీష్ నేర్చుకోవాలని, మాట్లాడాలని ఈ ఇద్దరు హీరోలు చెప్పేవారట. ఆ విధంగా నాగార్జున ఒక బుక్ ను గిఫ్ట్ గా ఇచ్చి.. ఇంగ్లీష్ నావెల్స్ చదవడం మొదలు పెట్టాలి అని చెప్పాడట. అలా ఇద్దరి ప్రోత్సాహం వల్ల ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలను అని తెలిపింది కుష్బూ.