RCB fans Demand Holiday : మూడుసార్లు ఫైనల్ వెళ్లినప్పటికీ.. ఇంతవరకు ట్రోఫీ అందుకోలేకపోయింది. ఇది ఒక రకంగా ఆ జట్టు మేనేజ్మెంట్, ఆటగాళ్లకు ఇబ్బంది కలిగించే విషయం.. ఇంతటి విఫల చరిత్ర ఉంది కాబట్టే.. ఆ జట్టును అత్యంత అన్ లక్కీ టీం అని పిలుస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో విమర్శలకైతే లెక్కలేదు. అయితే అటువంటి ఆ జట్టు ఈ సీజన్లో ఫైనల్ వెళ్లిపోయింది. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న జట్టును వారి సొంత మైదానంలోనే నేల నాకించి కాలర్ ఎగరేసింది. మొత్తంగా సెమి ఫైనల్ మ్యాచ్ ను ఏకపక్షంగా సాగించి తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఈ విజయం ద్వారా అభిమానుల్లో ఉత్సాహాన్ని తారస్థాయికి చేర్చింది.. ఎప్పుడైతే బెంగళూరు విజయం సాధించిందో.. ఇక అప్పటినుంచి అభిమానుల ఆనందానికి అడ్డు అనేది లేకుండా పోయింది. జట్టు ఫైనల్ వెళ్లిపోవడంతో.. వారు ఊహల్లో విహరిస్తున్నారు. తమ జట్టు ఎలాగైనా సరే కప్ సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇక కొందరు అభిమానులైతే తమ స్థాయిని దాటి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Also Read : యువ ఆటగాడిపై అనుచిత వ్యాఖ్యలు.. విరాట్ కోహ్లీకి తలవంపులు.. ఇంతకీ ఏం జరిగిందంటే!
సెలవు ఇవ్వాలట
ఐపీఎల్ ఫైనల్ చేరిన నేపథ్యంలో.. తమ బెంగళూరు జట్టు ఈసారి ఎలాగైనా సరే కప్ సాధిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. బలమైన ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక కు చెందిన అభిమాని శివానంద్ మల్లన్నవర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది..” జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. ఇప్పటికే బెంగళూరు జట్టు ఫైనల్ వెళ్లిపోయింది. గత మూడు పర్యాయాలు ఫైనల్ వెళ్లినప్పటికీ బెంగళూరు కప్ సాధించలేదు. కానీ ఈసారి ఎలాగైనా బెంగళూరు కప్ అందుకుంటుంది. జూన్ 3న ఎలాగూ కప్ అందుకుంటుంది కాబట్టి.. జూన్ 4 న సంబరాలు జరుపుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించండి.. కప్ గెలిచిన తేదీని ” ఆర్సీబీ అభిమానుల పండుగ” గా గుర్తించి సెలవు ఇవ్వాలని” ఆ లేఖలో శివానంద్ ముఖ్యమంత్రిని కోరడం గమనార్హం. అయితే దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..” ఫైనల్ మాత్రమే మీ జట్టు వెళ్లింది. ఇంకా విజయం సాధించలేదు. ఫైనల్ వెళ్లినందుకే ఈ స్థాయిలో ఓవరాక్షన్ చేస్తే ఎలా?, అందువల్ల మీ జట్టు విజయం సాధించడం లేదంటూ” నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. అయితే తమ జట్టు ఫైనల్ గా వెళ్ళిన తర్వాత ఆర్సీబీ అభిమానులు చేస్తున్న అతికి హద్దు అనేది లేకుండా పోతోంది. ఏ మాధ్యమాన్ని కూడా వదలకుండా వాళ్లు చేస్తున్న అతి ప్రచారం తారా స్థాయిని దాటి పోతోంది.