Gaddar Awards controversy : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించబోతున్న ‘గద్దర్ అవార్డ్స్'(Gaddar Awards) ని నిన్నటి నుండి ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న 2024 వ సంవత్సరం లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సినిమాలకు, అందులో నటించిన నటీనటులకు అవార్డ్స్ ని ప్రకటించారు. నేడు 2014 వ సంవత్సరం నుండి 2023 వ సంవత్సరం వరకు విడుదలై భారీ విజయాలను సాధించిన సినిమాలలో కొన్నిటిని ఎంచుకొని ‘ఉత్తమ చిత్రం’ అవార్డ్స్ ని ప్రకటించారు. అయితే ప్రకటించిన ఈ అవార్డ్స్ లో అత్యధిక శాతం అల్లు అర్జున్ సినిమాలకే ప్రాధాన్యత దక్కింది. ఉత్తమ నటుడి క్యాటగిరీలో అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ‘పుష్ప 2 ‘ చిత్రానికి ఎంపికయ్యాడు. అదే విధంగా గతం లో ఆయన హీరో గా నటించిన ‘అలా వైకుంఠపురంలో’ , అదే విధంగా సపోర్టింగ్ రోల్ చేసిన ‘రుద్రమదేవి’ చిత్రాలకు కూడా అవార్డ్స్ దక్కాయి.
Also Read:’హరి హర వీరమల్లు’ ట్రైలర్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం..ఫ్యాన్స్ సహనానికి పరీక్ష!
కానీ ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Global Star Ram Charan), ప్రభాస్(Rebel Star Prabhas) లకు మాత్రం ఈ అవార్డ్స్ లో ఎలాంటి చోటు దక్కలేదు. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళను గుర్తించపోతే చాలా పెద్ద తప్పిదం చేసినవాళ్లు అవుతారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే 2018 వ సంవత్సరం లో విడుదలైన ‘రంగస్థలం’ చిత్రంలో రామ్ చరణ్ నటన ఎంత అద్భుతంగా ఉన్నిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే గడిచిన దశాబ్ద కాలం లో నటన తో ఆ రేంజ్ గూస్ బంప్స్ రప్పించిన స్టార్ హీరో మరొకరు లేదు. నేషనల్ అవార్డు కూడా దక్కాల్సింది కానీ, ప్రయత్నాలు చేయలేదు. అలాంటి రామ్ చరణ్ ని ‘గద్దర్ అవార్డ్స్’ లోని 2018 వ సంవత్సరం కి గానూ ‘ఉత్తమ నటుడి’ క్యాటగిరీ లో అవార్డుని కచ్చితంగా కేటాయించాల్సిందే అని నెటిజెన్స్ కోరుకుంటున్నారు. అదే విధంగా ‘బాహుబలి 2’ కి ప్రభాస్ కి కచ్చితంగా ఉత్తమ నటుడి క్యాటగిరీలో అవార్డు ఇవ్వాల్సిందే.
ఎందుకంటే ‘బాహుబలి 2’ ఆయన నటన అంత అద్భుతంగా ఉంది కాబట్టి. అసలు ప్రభాస్ లేని బాహుబలి క్యారక్టర్ ని ఎవరైనా ఊహించగలరా?, పాత్రకు వన్నె తెచ్చిన అలాంటి గొప్ప నటనకి పాపం ఇప్పటి వరకు ఒక్క పురస్కారం కూడా దక్కలేదు. ఫిలిం ఫేర్, సైమా, IIFA ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఉన్నాయి. వాటిల్లో ప్రభాస్ కి ‘బాహుబలి 2’ లో అద్భుతంగా నటించినందుకు ఒక్క అవార్డు కూడా దక్కలేదు. బయటవాళ్ళు ఎలాగో గుర్తించలేదు, కనీసం ప్రభుత్వం తరుపున అయినా గుర్తించాలి, అదే న్యాయం అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ అయితే టెంపర్ నుండి దేవర వరకు వరుసగా 7 సూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు. ఈ 7 సినిమాల్లో కనీసం చిత్రనికైనా అవార్డు ఇవ్వాల్సిందే అని అభిమానుల నుండి డిమాండ్ ఉంది. మరి ప్రభుత్వం గుర్తిస్తుందా లేదా అనేది చూడాలి.