Kohli controversy with young player : ముల్లాన్ పూర్ లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ పై బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం తర్వాత తొమ్మిది సంవత్సరాల అనంతరం బెంగళూరు ఫైనల్ వెళ్ళింది. ట్రోఫీని గెలుచుకోవడానికి కేవలం ఒక స్టెప్ దూరంలోనే ఉంది. వాస్తవానికి హై వోల్టేజ్ గా సాగుతుందనుకున్న మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. బెంగళూరు జట్టు అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించి అదరగొట్టింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అతడిని ఇరకాటంలో పడేసాయి. పంజాబ్ జట్టు ఇన్నింగ్స్ లో ఇంపాక్ట్ ఆటగాడిగా ముషీర్ ఖాన్ రంగంలోకి దిగాడు. అయితే అతడు 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో అతనిపై విరాట్ కోహ్లీ చిల్లర వ్యాఖ్యలు చేశాడు..” నీటి సీసాలు అందించే వ్యక్తి బ్యాటింగ్ కు వచ్చాడు” అని విరాట్ కోహ్లీ తన స్థాయిని దిగజార్చుకొని వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అయితే ముషీర్ ఖాన్ ఈ మ్యాచ్లో కొన్ని ఓవర్లకు ముందు తమ జట్టు ప్లేయర్లకు వాటర్ బాటిల్స్ అందించాడు. అయితే పంజాబ్ జట్టు మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో అతడు ఇంపాక్ట్ ఆటగాడిగా బ్యాటింగ్ కు వచ్చాడు. క్రమంలో వాటర్ బాటిల్స్ అందించే ప్లేయర్ బ్యాటింగ్ కు వచ్చాడని ముషీర్ ఖాన్ ను ఉద్దేశించి చులకనగా వ్యాఖ్యలు చేశాడు.
Also Read : పడిన చోటే నిలబడింది.. బెంగళూరును ఎవడ్రా ఆపేది!
విరాట్ కోహ్లీ చేసిన పని ఇతర ప్లేయర్ల అభిమానులకు కూడా నచ్చలేదు. దీంతో పారి సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీని విమర్శిస్తున్నారు..” అతడిని పరుగుల యంత్రం అంటారు. గొప్ప ఆటగాడని చెబుతుంటారు. అతని వ్యక్తిత్వం మాత్రం నేలబారుతనాన్ని సూచిస్తూ ఉంటుంది. యంగ్ ప్లేయర్లను అతడు ఎంకరేజ్ చేయాల్సింది పోయి.. ఇలా తిట్టడం ఏంటని” వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బెంగళూరు అభిమానులు మాత్రం విరాట్ కోహ్లీకి అండగా ఉంటున్నారు. అతడిని వెనుకేసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. “ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ముషీర్ ఖాన్ కు విరాట్ కోహ్లీ బ్యాట్ ను బహుమతిగా ఇచ్చాడు. అతనిపై విరాట్ కోహ్లీకి ఎటువంటి ఉద్దేశం లేదు. కేవలం ఒక సోదరుడు లాగానే అతడిని ట్రీట్ చేస్తుంటాడు. సరదాగా చేసిన కామెంట్ ను ఇలా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆట పట్టిస్తుంటే దానిని మరో కోణంలో ఎందుకు చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. విరాట్ కోహ్లీ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలుసు. అతడు తోటి ఆటగాళ్లతో ఎలా ఉంటాడో కూడా తెలుసు. బెంగళూరు జట్టు ఫైనల్ వెళ్ళిన సందర్భాన్ని తట్టుకోలేక ఇలా కొంతమంది వ్యతిరేక ప్రచారానికి దిగుతున్నారు. ఇది ఏమాత్రం వాంఛనీయం కాదని” విరాట్ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇంత వివాదం జరుగుతున్నప్పటికీ అటు ముషీర్ ఖాన్, ఇటు విరాట్ కోహ్లీ ఇంతవరకు స్పందించలేదు.