Homeక్రీడలుక్రికెట్‌RCB Vs Gujarat Titans: ప్లే ఆఫ్ సమరం: వారి వల్లే బెంగళూరు గెలుపు.....

RCB Vs Gujarat Titans: ప్లే ఆఫ్ సమరం: వారి వల్లే బెంగళూరు గెలుపు.. గుజరాత్ ఓటమి

RCB Vs Gujarat Titans: బెంగళూరు సత్తా చూపించింది. నేరుగా ఫైనల్ దూసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు ఏకంగా గుజరాత్ పై 92 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తద్వారా వరుసగా రెండోసారీ ఫైనల్ వెళ్లిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. క్వాలిఫైయర్ 1 మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందనుకుంటే పూర్తి ఏకపక్షంగా సాగింది. బెంగళూరు విధించిన కొండంత లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ విఫలమైంది.

బెంగళూరు ప్రారంభం నుంచి అత్యంత కచ్చితత్వంతో బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్(93) తిరుగులేని ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ(43), క్రుణాల్ పాండ్యా (43) సూపర్ బ్యాటింగ్ చేశారు. బెంగళూరు భారీ స్కోర్ చేయడంలో వీరు ముగ్గరు అత్యంతకీలక పాత్ర పోషించారు. ఫలింతగా బెంగళూరు సగం మ్యాచ్ గెలిచేసేంది.

బౌలింగ్ లో డఫీ(3/39), రసిఖ్ సలామ్ (2/24), భువనేశ్వర్ కుమార్ (2/28), హేజిల్ వుడ్(1/39) సత్తా చూపించారు. ఈ నలుగురు మిగతా సగం బాధ్యతను నెరవేర్చడంతో బెంగళూరు దర్జాగా గెలుపును అందుకుంది. పవర్ ప్లే లోనే బెంగళూరు 51 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. దీనిని బట్టి గుజరాత్ జట్టు బ్యాటింగ్, బెంగళూరు బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భీకరమైన ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్14 పరుగులకే దారుణంగా హిట్ వికెట్ గా వెనుదిరిగాడు. ఫోర్ కొట్టిన అతడు బ్యాట్ మీద నియంత్రణ కోల్పోయాడు. అది చేతుల నుంచి జారి వికెట్ల మీద పడిపోయింది. భువనేశ్వర్ వేసిన బంతి వల్ల గిల్(2) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బట్లర్(29) హేజిల్ వుడ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నిశాంత్ సింధు(5), హోల్డర్(0) గోల్డెన్ డక్ గా ఔటయ్యాడు. చివర్లో రాహుల్ తేవాటియా(68) అదరగొట్టడంతో ఓటమి అంతరంమాత్రమే తగ్గింది.

పాటిదార్ ను ఔట్ చేయలేకపోవడం.. గుజరాత్ బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకోవడంతో బెంగళూరు 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగులు చేసింది. గుజరాత్ లో సాయి సుదర్శన్, గిల్ విఫలం కావడం, కీలక ఆటగాళ్లు ఔట్ కావడంతో ఓటమి తప్పలేదు. గుజరాత్ నుంచి ఈ స్థాయి ఆటను అంచనా వేయలేదని అభిమానులు పేర్కొంటున్నారు. గుజరాత్ జట్టు కేవలం 162 పరుగులకు ఆలౌట్ కావడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పడుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular