Homeఆధ్యాత్మికంToday 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి...

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.. పనులన్నీ పూర్తవుతాయి..

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం పొందే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి కొన్ని పనులు పూర్తి కావాలంటే కష్టపడాల్సి వస్తుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు […]

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం పొందే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి కొన్ని పనులు పూర్తి కావాలంటే కష్టపడాల్సి వస్తుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు చాలా రంగాల్లో కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి పెద్దలను సంప్రదిస్తారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఇతరులకు వాగ్దానాలు ఇవ్వకూడదు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొన్ని పనులు పూర్తి కావాలంటే కష్టపడాల్సి వస్తుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి రాజయోగం ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. అవసరమైన వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అన్ని పనులు పూర్తవుతాయి. గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు కొత్త ఆదాయ వనరులను ఏర్పడతాయి. ఉద్యోగులు ముఖ్యమైన బాధ్యతలను చేపడతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. అన్ని రకాలుగా శుభయోగాలు ఉండడంతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో దృష్టి పెట్టాలి.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాలనుంచి శుభవార్తలు అందుతాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి మద్దతుతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలవుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు పాత ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడతారు. ఆర్థికపరమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు పెడతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వ్యాపార పర్యటనలు లాభాలు చేకూరుస్తాయి. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా కడుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గతంలో కంటే ఇప్పుడు అధికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో ఈరోజు పూర్తి చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు అధిక లాభాలు రావచ్చు. ఉద్యోగులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. దీర్ఘకాలికంగా దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో కలిసి వస్తుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే కష్టపడాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు రావచ్చు. కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper