spot_img
Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: రాహుల్ ద్రావిడ్ సార్ పిలిచారు.. సంజు భయ్యా వచ్చాడు.. వైభవ్ సూర్య వంశీ...

Vaibhav Suryavanshi: రాహుల్ ద్రావిడ్ సార్ పిలిచారు.. సంజు భయ్యా వచ్చాడు.. వైభవ్ సూర్య వంశీ కామెడీ పీక్స్ అస్సలు.. వైరల్ వీడియో

Vaibhav Suryavanshi: టీమిండియాలో ఇంకా ప్రవేశం లభించలేదు గాని.. సోషల్ మీడియాలో.. మైదానంలో యంగ్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న అతడు.. ఇప్పటికే సరి కొత్త రికార్డులను సృష్టించాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో పెను విధ్వంసం సృష్టించాడు. 2026 ఐపీఎల్ కోసం అతడు సిద్ధమవుతున్నాడు.

ఆదివారం నాన్ అవార్డ్స్ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆటగాళ్లతో జియో హాట్ స్టార్ సరదా సంభాషణ సాగించింది. వైభవ్ సూర్య వంశీ తో జియో హాట్ స్టార్ ప్రతినిధి మాట్లాడారు. ” మీరు వీరోచితంగా ఎలా ఆడగలుగుతున్నారు.. బంతిని చూడగానే ఎలా స్పందిస్తారు. గత ఏడాది తొలిసారి ఐపీఎల్ లో ఆడారు కదా.. తొలి బంతి ఎదుర్కొన్నారు కదా.. అప్పుడు ఎలా అనిపించింది” అని అడిగాడు. దానికి వైభవ్ సూర్య వంశీ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.

” ఆరోజు రాహుల్ ద్రావిడ్ సార్ నన్ను రమ్మని చెప్పారు. నేను గదిలోకి వెళ్లాను. అంతకుముందు నా గురించి కెప్టెన్ సంజు శాంసన్ భయ్యాతో కలిసి చర్చించారు. ఆరోజు నేను ద్రావిడ్ సార్ రూముకి వెళ్తుండగా.. సంజు కలిశారు. నీ బ్యాటింగ్ స్టైల్ ఏంటి.. ఎదుర్కొన్న బంతులను ఎలా కొడతావు.. నీకు ఐపీఎల్లో ఆడిన అనుభవం లేదు కదా.. నువ్వు చూడబోతే చిన్నవాడి మాదిరిగా ఉన్నావ్.. ఎలా ఎదుర్కొంటావని రకరకాల ప్రశ్నలను రాహుల్ ద్రావిడ్ సంధించాడు. దానికి నేను నా స్టైల్ లో సమాధానం చెప్పాను. బంతిని సమర్థవంతంగా ఎదుర్కొంటానని” వైభవ్ చెప్పాడు.. మధ్యలో సంజు కల్పించుకుని” నేను బాగా ఆడతాను సార్. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. బంతిని చూడగానే బ్యాట్ తో స్పీడు మూమెంట్ ఇస్తాను సార్. బంతిని బలంగా కొడతాను సార్.. అది సిక్సర్ వెళ్తుంది సార్” అంటూ అమాయకంగా చెప్పాడు. దానికి రాహుల్ ద్రావిడు నవ్వుకున్నారు. అనుకున్నట్టుగానే వైభవ్ తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్ కొట్టారని” సంజు సమాధానం చెప్పాడు. దీంతో ఈ సంభాషణ మొత్తం సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version