Priyansh Arya
Priyansh Arya : ఐపీఎల్ (IPL) 18 ఎడిషన్లో ఒక్కో మ్యాచ్లో ఒక్కో ఆటగాడు స్టార్ లాగా అవతరిస్తున్నాడు. ముంబై – చెన్నై (MI vs CSK)మధ్య జరిగిన మ్యాచ్లో విగ్నేష్ పుతూర్ (Vignesh putur) సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.. ఢిల్లీ – లక్నో (DC vs LSG) జట్ల మధ్య విప్రజ్ నిగం(vipraj Nigam) అద్భుతమైన ఆట తీరుతో అలరించాడు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రియాన్ష్ ఆర్య (priyansh Arya) కూడా చేరిపోయాడు. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో (GT vs PBKS) పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తరఫున ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాన్ష్ ఆర్య.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓపెనర్ గా వచ్చి మైదానంలో పెను విధ్వంసాన్ని సృష్టించాడు. వెంట్రుక వాసిలో హాఫ్ సెంచరీ కోల్పోయినప్పటికీ.. 23 బంతులు ఎదుర్కొన్న అతడు ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. రబడ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. వాస్తవానికి అతడు కొట్టిన 2 సిక్సులు ఈ మ్యాచ్ మొత్తానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎంట్రీ మ్యాచ్ లోనే భయం అనేది లేకుండా.. సలార్ సినిమా(Salar movie)లో కాటేరమ్మ కొడుకు లాగా ఊచ కోత కోశాడు.
Also Read : ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు.. ఐపీఎల్ లో ఇతడి పై కనకవర్షమే..
ఎవరీ ప్రియాన్ష్ ఆర్య?
ప్రియాన్ష్ ఆర్య వయసు 26 సంవత్సరాలు. ఇతడు ఢిల్లీకి చెందినవాడు. ఇతడి తల్లిదండ్రులు వృత్తిరీత్యా టీచర్లు. ప్రియాన్ష్ సరదాగా గల్లీ క్రికెట్ ఆడేవాడు. దీంతో అతడి ఆసక్తిని గమనించిన తండ్రి సంజయ్ భారద్వాజ్ కోచింగ్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ బ్యాటింగ్ నేర్చుకున్న అతడు.. గంభీర్ ఆధ్వర్యంలో మరింత ఆట మీద పట్టు సాధించాడు. అతడి ఆసక్తిని గమనించిన గౌతమ్ గంభీర్ క్రికెట్ కిట్ బహుమతిగా ఇచ్చాడు. 2021లో దేశవాళీ టి20లోకి ప్రియాన్ష్ ఆర్య ఎంట్రీ ఇచ్చాడు. 2023లో సయ్యద్ ముస్తాక్ అలిట్రోఫీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. తమిళనాడు స్పిన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కర్ణాటక పేస్ బౌలర్లపై దుమ్మురేపాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 176.63 స్ట్రైక్ రేట్ తో 325 రన్స్ చేశాడు. 43 బంతుల్లోనే 102 పరుగులు చేసి అదరగొట్టాడు. 2024 లో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు కొట్టి.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ జట్టుకు ఆడిన అతడు 608 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇందులో అతడు 608 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇందులో అతడు ఏటంగా రెండు సెంచరీలు చేశాడు. ఆయుష్ బదోనితో కలిసి ఓ మ్యాచ్లో 286 రన్స్ పార్ట్నర్ షిప్ నెలకొల్పాడు. గత మెగా వేలంలో అన్ని జట్ల యాజమాన్యాలు అతడిని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాయి. చివరికి పంజాబ్ యాజమాన్యం 3.8 కోట్ల భారీ ధరకు అతడిని కొనుగోలు చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్లో దుమ్ము రేపడంతో.. అతడికి తొలి మ్యాచ్లో పంజాబ్ జట్టు యాజమాన్యం అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ఒకవేళ గనుక అతడు ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియా లో ప్రవేశించడం అంత కష్టం కాదు.
Also Read : క్రికెట్ ఫీవర్ అంటే అలా ఉంటది మరి..వ్యూస్ లో jio hotstar సరికొత్త రికార్డు..
6️⃣
There’s nothing Priyansh Arya can’t do #AdaniDPLT20 #AdaniDelhiPremierLeagueT20 #DilliKiDahaad | @JioCinema @Sports18 pic.twitter.com/lr7YloC58D
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 31, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Priyansh arya entry match performance
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com