Pilot forgets passport
Pilot forgets passport : సాధారణగా పౌరులు ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లాలంటే పాస్‌పోర్టు(Passport) తప్పనిసరి. ఇక పౌరులు ఎక్కువగా విమానాల్లోనే ప్రయాణిస్తారు. ప్రయాణ సమయంలో ఎయిర్ పోర్టులో పాస్‌పోర్టు స్టాంపింగ్ ఉంటుంది. ఫ్లైట్ దిగిన తర్వాత మరోమారు తనిఖీ చేస్తారు.
ఒక దేశ పౌరులు మరో దేశం వెళ్లడానికి పాస్‌పోర్టు తప్పనిసరి. కొన్ని దేశాలు పాస్ పోర్టు లేకున్నా అనుమతి ఇస్తున్నాయి. కానీ చాలా దేశాలు పాస్ట్‌పోర్టు ఉన్నవారిని మాత్రమే దేశంలోకి అనుమతిస్తాయి. అందుకే పాస్ట్‌పోర్టు తప్పనిసరి. ఇక ఈ పాస్ పోర్టులలో చాలా రకాలు ఉన్నాయి. అయితే.. పాస్ పోర్టు ప్రయాణికులకే కాదు.. విమాన సిబ్బంది. పైలట్‌లకు(Poilet) కూడా తప్పనిసరి ఒక దేశం నుంచి మరో దేశం వెళ్లే విమాన సిబ్బంది, పైలెట్లు కూడా పాస్‌పోర్టు తీసుకెళ్లారు. అయితే అమెరికా(America) నుంచి చైనా(Chaina)కు వెళ్లాల్సిన ఓ విమానంలో ప్రయాణికులకు ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలెస్ నుంచి షాంఘైకి బయలుదేరిన యునైటెడ్ ఎయిర్లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం, రెండు గంటల పసిఫిక్ మహాసముద్ర ప్రయాణం తర్వాత గమ్యం వైపు వెళ్లకుండా వెనక్కి మళ్లింది. చివరకు శాన్ఫ్రాన్సిస్కో(Shanfransisco)లో ల్యాండ్ అయింది. దీంతో విమానంలోని 257 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక కొందరు కంగారు పడగా, వాస్తవం తెలిసిన తర్వాత అంతా అవాక్కయ్యారు.
Also Read : 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వాళ్లకు పాస్ పోర్టు కావాలంటే అది ఇవ్వాల్సిందే
ఏం జరిగిందంటే..
ఈ విచిత్ర ఘటనకు కారణం పైలట్ తన పాస్పోర్టు మరచిపోవడమేనని యునైటెడ్ ఎయిర్లైన్స్(United Air lines) వెల్లడించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణంలో పైలట్‌కు పాస్పోర్టు తప్పనిసరి కాగా, ఈ నిర్లక్ష్యం వల్ల విమానం మధ్యలోనే తిరిగి రావాల్సి వచ్చింది. సంఘటన తెలిసిన ప్రయాణికులు పైలట్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రెండు గంటలు గాల్లో తిరిగి మళ్లీ అమెరికాకే వచ్చామంటే ఇది ఏమిటి?’’ అని కొందరు వాపోయారు.
ప్రయాణికులకు ప్రాధాన్యం..
యునైటెడ్ ఎయిర్లైన్స్ మాత్రం పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆహారం, పరిహారం అందించినట్లు పేర్కొంది. అదే రోజు సాయంత్రం మరో విమానంలో ప్రయాణికులను షాంఘైకి పంపించినట్లు వెల్లడించింది. అయితే, ఈ ఆలస్యం వల్ల సాధారణ షెడ్యూల్‌తో పోలిస్తే ఆరు గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకున్నారు.
ఈ ఘటన ప్రయాణికులకు ఒక వింత అనుభవంగా మిగిలిపోయింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఇలాంటి సంఘటనలు అరుదని, భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఎయిర్లైన్స్ హామీ ఇచ్చింది. ‘‘పాస్పోర్టు లేకుండా పైలట్ ఎలా బయలుదేరాడు?’’ అనే ప్రశ్న మాత్రం ప్రయాణికుల మదిలో మిగిలిపోయింది.
Also Read : పాస్‌పోర్ట్‌లోని పేజీని చింపివేస్తే మీ ట్రావెల్ హిస్టరీ తొలగిపోతుందా.. ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది ?
Web Title: Pilot forgets passport america china reverse
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com