Priyand Arya : ఎక్కడో ఢిల్లీలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ -2024 నడుస్తోంది. ఓ మ్యాచ్లో ఓ ఆటగాడు.. అతని పేరు ప్రియాన్ష్ ఆర్య.. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాడు. అవి మొత్తం కూడా బౌలర్ తల మీదుగానే బాదాడు. ఆ మ్యాచ్ చూస్తున్న పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ కు ఏమీ అర్థం కాలేదు.. వీడెవడురా బాబు ఇలా ఉన్నాడు అనుకున్నారు. భలే ఆటగాడు దొరికాడు అనుకుంటూ అతడిని ఐపీఎల్ మెగా వేలంలో 3.8 కోట్లకు కొనుగోలు చేసింది. నాడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఇంతలా అయితే దూకుడు కొనసాగించాడో.. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై జట్టుపై అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. 39 బంతుల్లో సెంచరీ చేసిన అతడు.. దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. అన్ క్యాప్డ్ ఆటగాడిగా రంగంలోకి వచ్చిన అతడు.. ఇప్పుడు ఏకంగా పంజాబ్ జట్టుకు మొనగాడు అయిపోయాడు.
Also Read : ఆర్సీబీని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందేనా?
ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా గేల్ కొనసాగుతున్నాడు. బెంగళూరు జట్టు తరఫున గేల్ ఆడుతున్నప్పుడు పూనే వారియర్స్ జట్టు మీద 30 బంతుల్లోనే అతడు సెంచరీ చేశాడు. 2013 ఐపీఎల్ సీజన్లో ఈ మ్యాచ్ జరిగింది.. రాజస్థాన్ రాయల్స్ చెట్టు తరఫున యూసఫ్ పటాన్ ఆడుతున్నప్పుడు.. ముంబై ఇండియన్స్ జట్టుతో 2010లో జరిగిన మ్యాచ్లో 37 బంతుల్లోని అతడు సెంచరీ చేశాడు. గత ఏడాది బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు హెడ్ 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇక ఇప్పుడు పంజాబ్ జట్టు ఆటగాడు ప్రియాన్ష్ ఆర్య చెన్నై జట్టుపై జరిగిన మ్యాచ్లో 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు.. తద్వారా ఐపీఎల్ చరిత్రలో నాలుగో వేగవంతమైన సెంచరీని పూర్తిచేశాడు.. అతని దూకుడు వల్ల పంజాబ్ జట్టు 221 పరుగులు చేసింది.
ప్రియాన్ష్ ఆర్య ఇప్పుడే ఇలా ఆడుతున్నాడు అంటే.. భవిష్యత్తు కాలంలో అతడు దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను సులభంగా బద్దలు కొడతాడని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు..” అతడికి ఏమాత్రం భయం లేదు. భయం అంటే అతడికి అర్థం కూడా తెలియనట్టుంది. లేకపోతే ఓపెనర్ గా వచ్చిన వ్యక్తి.. చివరిదాకా ఆడటం.. అది కూడా ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఆడటం అంటే మామూలు విషయం కాదు. తోటి ఆటగాళ్లు విఫలమవుతున్నప్పటికీ అతడు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. పైగా శశాంక్ సింగ్ లాంటి ఆటగాడితో విలువైన భాగస్వామ్యం నెలకొల్పడం అంటే మాటలు కాదు. తోటి ఆటగాళ్ల నుంచి గనుక బలమైన సహకారం వచ్చి ఉంటే.. పంజాబ్ జట్టు ఇంకా ఎక్కువ స్కోరు చేసి ఉండేది. అయినప్పటికీ ప్రియాన్ష్ ఆర్య ఇప్పుడు పంజాబ్ జట్టుకు సరికొత్త ధ్రువతార అని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా అభిమానులు చేసిన పనికి అందరూ ఫిదా