LSG Vs KKR IPL 2025: ఐపీఎల్ (IPL) లో ఇప్పటివరకు 17 ఎడిషన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 18వ ఎడిషన్ నడుస్తోంది. ట్రోఫీ కోసం అన్ని జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ లో ఇప్పటి వరకు చేరి ఐదు సార్లు విజేతలుగా నిలిచి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ రికార్డులు నెలకొల్పాయి.
Also Read: కోహ్లీ దంచికొడుతున్నాడు.. రోహిత్ తండ్లాడుతున్నాడు..
గత సీజన్లో ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి కోల్ కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. 10 సంవత్సరాల అనంతరం ఐపీఎల్ ట్రోఫీని మరోసారి సొంతం చేసుకుంది. నాడు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించాడు. గౌతమ్ గంభీర్ మెంటర్ గా వ్యవహరించాడు. ఇప్పుడు ప్రస్తుత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్రయాణం నల్లేరు మీద నడకలాగా అయితే లేదు. పడుతూ లేస్తూ ఆ జట్టు ప్రయాణం సాగుతోంది.. ఇక మంగళవారం కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్(KKR vs LSG) పోటీ పడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్నది. ఇదే వేదికగా ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ తో ఓటమి, అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ తో ఓటమి తర్వాత.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సాధించిన అతిపెద్ద విజయం ఇదే. ఈ సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.. ఇది ఆ జట్టుకు తొలి గెలుపు. మొత్తంగా పాయింట్లు పట్టికలో కోల్ కతా నైట్ రైడర్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది.
అభిమానం చాటుకున్నారు
ఐపీఎల్ లో బలమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న జట్లు ఏవి అంటే వెంటనే చెన్నై, ముంబై, హైదరాబాద్, బెంగళూరు పేర్లు గుర్తుకు వస్తాయి. అయితే అభిమానులు ఆ జట్లకు తాము తీసిపోమని కోల్ కతా ఫ్యాన్స్ నిరూపించారు. మంగళవారం లక్నోతో జరుగుతున్న మ్యాచ్ నేపథ్యంలో.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అభిమానులు తమ ప్రేమను వినూత్నంగా చూపించారు. గత సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచిన నేపథ్యంలో..కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుఖ్ ఖాన్ ట్రోఫీ అందుకున్న దృశ్యాలను.. అంతకుముందు రెండుసార్లు ట్రోఫీలు దక్కించుకున్న తీరును ప్రతిబింబిస్తూ అతిపెద్ద TIFO ఏర్పాటు చేశారు. అందులో we rise we fall we conquer అని భారీ అక్షరాలతో రాశారు. దానిని స్టేడియంలో ప్రదర్శించారు. ఇది సోషల్ మీడియాలో పెద్దపెట్టున ప్రచారం కావడంతో.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అభిమానులు మహా ఘటికులని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ చేస్తున్న లక్నో జట్టు ఈ కథనం రాసే సమయం వరకు 10 ఓవర్లు పూర్తి అయ్యేసరికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 95 పరుగులు చేసింది. లక్నో ఓపెనర్లు మార్ష్(49), మార్క్రం(43) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. వీరిద్దరిని విడతీయడానికి రహనే వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, జాన్సెన్, హర్షిత్ రాణా ను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది.
HUGE TIFO BY KKR FANS AT EDEN GARDENS pic.twitter.com/HzZQUsJM3z
— Johns. (@CricCrazyJohns) April 8, 2025