Priyansh Arya : చెన్నై జట్టుపై 39 బంతుల్లో సూపర్ సెంచరీ చేసి ఆకట్టుకున్న ప్రియాన్ష్ ఆర్య.. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయాడు. ఓపెనర్ గా వచ్చి.. మరో నాలుగు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుండగా అవుట్ అయిన అతని ధీరత్వం చాలామందికి నచ్చుతున్నది. చిన్న వయసులోనే సూపర్ సెంచరీ చేసి.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రియాన్ష్ ఆర్య నిలవడంతో చాలామంది అతడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2024లో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ప్రియాన్ష్ ఆర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌలర్ తల మీదుగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. అంతేకాదు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఏకంగా 10 మ్యాచ్లలో 608 రన్స్ చేశాడు. ఈ పరుగులలో అతడు 198.69 స్ట్రైక్ రేట్, 67.56 సగటు కొనసాగించాడు. మహామహులైన ఆటగాళ్లు కూడా ఇలాంటి గణాంకాలు నమోదు చేయరు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో సత్తా చూపించడం వల్లే ప్రియాన్ష్ ఆర్య కు ఐపీఎల్ లో అవకాశం వచ్చింది. పంజాబ్ జట్టు యాజమాన్యం అతడిని 3.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక చెన్నై జట్టుతో సెంచరీ చేయడంతో ఒక్కసారిగా ప్రియాన్ష్ ఆర్య సూపర్ ఆటగాడు అయిపోయాడు.
Also Read : ఎంట్రీ మ్యాచ్ లోనే కాటేరమ్మ కొడుకు లాగా ఆడాడు.. టీమిండియాలోకి వచ్చేస్తాడు..
అతడు రోల్ మోడల్
ప్రియాన్ష్ ఆర్య కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అతడి ఇష్టానికి గమనించి తల్లిదండ్రులు ఖర్చు ఎక్కువైనా పర్వాలేదని శిక్షణ ఇప్పించారు. తల్లిదండ్రులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రియాన్ష్ ఆర్య క్రికెటే లోకంగా బతికాడు. క్రికెట్ ను నిత్యం స్మరించేవాడు. అంతేకాదు గౌతమ్ గంభీర్ ఆడే ఆటను ఎక్కువగా చూసేవాడు. అతడి కొట్టే షాట్లు.. టెక్నిక్ ను గమనించేవాడు. చివరికి అతడినే తన రోల్ మోడల్ గా చేసుకున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఆటగాళ్ల ఆట చూసేందుకు వచ్చిన గౌతమ్ గంభీర్ ను ప్రియాన్ష్ ఆర్య కలిశాడు. ఈ సందర్భంగా తన మనసులో మాటను చెప్పాడు. దానికి గౌతమ్ గంభీర్ ఆశ్చర్యపోకపోయినప్పటికీ.. కెరియర్ మీద ఎలా ఫోకస్ చేయాలో తనదైన శైలిలో చెప్పాడు. దానిని ప్రియాన్ష్ ఆర్య మరింత సీరియస్ గా తీసుకున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో అదరగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చోటు సంపాదించాడు. ఇప్పుడు పంజాబ్ జట్టుకు సరికొత్త దేవుడయ్యాడు. మొత్తంగా సూపర్ సెంచరీ తో 2025 సీజన్ లో రెండవ శతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు.
Also Read : అన్ క్యాప్డ్ ఆటగాడు.. 6 బంతులకు ఆరు సిక్సర్ల మొనగాడు..
Priyansh Arya was asked who is his role model.
“@GautamGambhir is my role model. I grew up watching hi practice in the nets.” #CSKvsPBKS pic.twitter.com/NmF1UFynTA
— Madhav Sharma (@HashTagCricket) April 8, 2025