మళ్లీ మనసు గెలిచిన ప్రధాని మోడీ

సమకాలీన వ్యవహారాలను అందిపుచ్చుకోవడంలో ప్రధాని మోడీని మించిన వారు లేరంటారు. అందరూ ప్రధాని పదవి అనగానే చాలా బిజీగా ఉంటారు.. ఏవేవో సమీక్షలు, అంతర్జాతీయ వ్యవహారాలు అంటూ ప్రజలను, వారి ఆకాంక్షలను పట్టించుకోరు.. కానీ వీరందరికీ భిన్నంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు దేశమంతా మన పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్ లో సెమీస్ లో గెలుస్తుందని.. ఈసారి స్వర్ణం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్.. ప్రపంచ నంబర్ 1 జట్టు బెల్జియం చేతిలో […]

Written By: NARESH, Updated On : August 3, 2021 1:29 pm
Follow us on

సమకాలీన వ్యవహారాలను అందిపుచ్చుకోవడంలో ప్రధాని మోడీని మించిన వారు లేరంటారు. అందరూ ప్రధాని పదవి అనగానే చాలా బిజీగా ఉంటారు.. ఏవేవో సమీక్షలు, అంతర్జాతీయ వ్యవహారాలు అంటూ ప్రజలను, వారి ఆకాంక్షలను పట్టించుకోరు.. కానీ వీరందరికీ భిన్నంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తుంటారు.

ఇప్పుడు దేశమంతా మన పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్ లో సెమీస్ లో గెలుస్తుందని.. ఈసారి స్వర్ణం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ బ్యాడ్ లక్.. ప్రపంచ నంబర్ 1 జట్టు బెల్జియం చేతిలో సెమీస్ లో భారత్ 5-2 తేడాతో ఓడిపోయింది. అయితే చివరి వరకు బెల్జియంను ముప్పుతిప్పలు పెట్టి సమఉజ్జీగా నిలిచి పోరాడింది. మూడు క్వార్టర్ల వరకు 2-2తో సమంగా నిలిచింది. నాలుగో క్వార్టర్ లో బెల్జియం విజృంభించడంతో భారత్ ఓడిపోయింది.

అయితే ఓడినా కూడా స్ఫూర్తిదాయకంగా ఆడిన భారత పురుషుల హాకీ జట్టుకు ప్రధాని నరేంద్రమోడీ అండగా నిలిచారు. గెలుపోటమలు జీవితంలో భాగమనేని తెలిపారు. సెమీస్ లో బెల్జియంపై సామర్థ్యం మేరకు అత్యుత్తమంగా పోరాడారని పేర్కొన్నారు.

భారత్-బెల్జియం మ్యాచ్ సెమీస్ పోరును ప్రధాని మోడీ ప్రత్యక్షంగా చూడారు. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం పురుషుల హాకీ టీం కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ తో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. వారికి ధైర్యంచెప్పారు. ఓడిపోయినా బాగా ఆడారని పేర్కొన్నారు. ఇప్పటివరకు టీం ఇండియా ప్రదర్శన చాలా బాగుందన్నారు. కాంస్యం కోసం పోరులో రాణించాలని వెన్నుతట్టారు.

మోడీ ట్వీట్ చేస్తూ ‘ఒలింపిక్స్ లో భారత్-బెల్జియం పురుషుల హాకీ సెమీస్ ను చూ్తున్నాను. మన జట్టు నైపుణ్యాలను చూసి గర్విస్తున్నాను. గెలవాలని కోరుకుంటున్నాను’ అని మొదట ట్వీట్ చేశాడు.

మ్యాచ్ లో టీమిండియా ఓటమి తర్వాత ట్వీట్ చేశాడు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. టోక్యో ఒలింపిక్స్ లో మన హాకీ జట్టు అత్యుత్తమంగా పోరాడింది. అదే మనకు ముఖ్యం.. తర్వాత మ్యాచు, భవిష్యత్ సిరీసుల్లో గెలవాలని కోరుకుంటున్నా.. మన ఆటగాళ్లను చూసి భారత్ గర్విస్తోంది’ అని మోడీ ట్వీట్చేశారు.