విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ దిల్లీలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఏపీ భవన్ వద్ద వివిధ కార్మిక సంఘాల నేతృత్వంలో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విశాఖ ఉక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.