హీరోయిన్ సాయి పల్లవి అంటేనే హోమ్లీ బ్యూటీ. ఫ్యామిలీ హీరోయిన్. సింపుల్ గా చెప్పాలంటే… సాయిపల్లవి రెగ్యులర్ హీరోయిన్లకు పూర్తి భిన్నం. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ లు కుటుంబ బంధాలను బలంగా చాటే విధంగా ఉంటాయి. తాజాగా సాయి పల్లవి తన తాతయ్య 85వ పుట్టిన రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసి.. ఆయనకు గొప్ప జ్ఞాపకాన్ని అందించింది.
పైగా ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి… ఇంట్లో తాతయ్యలను అమ్మమ్మలను పట్టించుకోండి అనే మెసేజ్ ను పాస్ చేసింది. అసలు హీరోయిన్లు అందరూ తమ హాట్ హాట్ గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంటే.. సాయి పల్లవి మాత్రం తన ఫ్యామిలీ ఫంక్షన్ల ఫొటోస్ ని ఎక్కువగా షేర్ చేస్తూ తన భావజాలం ఏమిటో, తన క్యారెక్టర్ ఏమిటో బాగా చెబుతుంది.
ఇక సాయి పల్లవి షేర్ చేసిన తన గ్రాండ్ పేరెంట్స్ తో దిగిన ఫోటోలు, తన చెల్లెలితో తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. వెండితెర పైనే కాదు రియల్ లైఫ్ లో కూడా సాయి పల్లవి పద్దతికి మారుపేరు అని మరోసారి ఘనంగా నిరూపించుకుంది. నిజానికి సాయి పల్లవి సింప్లిసిటీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంత సహజంగా ఉంటుంది ఆమె.
సినిమాకి కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నా.. ఇప్పటికీ సాధారణ మధ్యతరగతి కుటుంబ జీవనశైలిని పాటిస్తూ ఉండటం.. బహుశా ఈ జనరేషన్ లో ఒక్క సాయి పల్లవికే సాధ్యం అయింది అనుకుంటా. ఇక సాయి పల్లవి నటించిన శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’, రానా ‘విరాట పర్వం’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.