Champions Trophy 2025: 2013 తర్వాత టీమ్ ఇండియా 2017 లో కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ వెళ్లినప్పటికీ.. దురదృష్టం కొద్ది దాయాది జట్టు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత ఒక జీవితానికి సరిపడా విమర్శలను మూటగట్టుకుంది. ఆ విమర్శల వల్ల టీమ్ ఇండియా ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఎంతలా అంటే ఐసీసీ 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తే.. దానిని కొట్టేసే విధంగా టీమిండియా తన ఆట తీరు మార్చుకుంది. 8 సంవత్సరాల అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీని ఐసిసి నిర్వహిస్తే.. అందులో కూడా టీమిండియా ఫైనల్ వెళ్ళింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ వంటి జట్లను గ్రూప్ దశలో ఓడించింది. సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఫైనల్ లో మళ్ళీ న్యూజిలాండ్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో బొంద పెట్టింది. మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీని సగర్వంగా దక్కించుకుంది. 2002లో తొలిసారిగా శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా ఆవిర్భవించిన టీమ్ ఇండియా.. 2013లో ధోని నాయకత్వంలో రెండవసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఇక 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ప్రతిభ చూపి ముచ్చటగా మూడవసారి సొంతం చేసుకుంది..
Also Read: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు.. కట్ చేస్తే ఇప్పుడతడు టీమిండియా పాలిట కొత్త దేవుడు..
వీళ్లను మర్చిపోయాం
టీమిండియా న్యూజిలాండ్ పై విజయం సాధించిన అనంతరం సోషల్ మీడియాలో ప్రశంసల కురుస్తోంది. మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. టీమిండియా సంగతి కాస్త పక్కన పెడితే.. ఛాంపియన్స్ ట్రోఫీలో కొంతమంది ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పరుగుల విషయంలో.. వికెట్ల విషయంలో సత్తా చూపించారు. పరుగుల జాబితాలో పరిశీలిస్తే న్యూజిలాండ్ ఓపెనర్ రచించిన రవీంద్ర 263 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. నాలుగు మ్యాచ్లలో అతని ఏకంగా రెండు సెంచరీలు చేశాడు. ఇక ఆ తర్వాత స్థానాలలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 243 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ ఉన్నాడు. ఇతడు 227 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ 225 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇతడు పది వికెట్లను సొంతం చేసుకున్నాడు. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 9 వికెట్లు సొంతం చేసుకొని రెండవ స్థానంలో ఉన్నాడు.. న్యూజిలాండ్ బౌలర్, కెప్టెన్ శాంట్నర్ 9 వికెట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టీం ఇండియా బౌలర్ షమీ కూడా 9 వికెట్లు సాధించి అతడు కూడా రెండవ స్థానంలో ఉన్నాడు..బ్రేస్ వెల్ ఎనిమిది వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి గనక ప్రారంభం నుంచి జట్టులో ఉంటే హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉండేవాడు. ఎందుకంటే దుబాయ్ మైదానాలు స్పిన్ బౌలింగ్ కు అద్భుతంగా సహకరించాయి.
Also Read: అవకాశం ఇవ్వాలే గాని.. మన క్రికెటర్లు కూడా ప్రభుదేవా, గణేష్ ఆచార్యలు అయిపోతారు..