Homeఎంటర్టైన్మెంట్F3 actor : రియల్ లైఫ్ లో నటి ప్రగతి ఎలా ఉంటుంది? ఎఫ్ 3...

F3 actor : రియల్ లైఫ్ లో నటి ప్రగతి ఎలా ఉంటుంది? ఎఫ్ 3 నటుడు బయటపెట్టిన నిజాలు!

F3 actor : ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు ప్రాంతంలో జన్మించిన ప్రగతి హీరోయిన్ కావాలనే కోరికతో మోడలింగ్ చేసింది. అనంతరం చెన్నై వెళ్లి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దర్శకుడు, నటుడు అయిన భాగ్యరాజు ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 1994లో విడుదలైన వీట్ల విశేషంగా ఆమె మొదటి చిత్రం. నాలుగైదు చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ పాత్రలు చేసింది. చిన్న వయసులోనే వివాహం చేయడంతో ఆమె కెరీర్ మీద ప్రతికూల ప్రభావం పడింది. కొన్నాళ్ళు సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమ్ బ్యాక్ ఇచ్చింది.

Also Read : F3 లో నటించిన ఇతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మెంటలెక్కిపోతారు

2002లో విడుదలైన బాబీ మూవీలో ప్రగతి హీరో మహేష్ బాబు తల్లి రోల్ చేసింది. నిజానికి ఆ పాత్ర చేసే నాటికి మహేష్-ప్రగతి వయసు ఒకటే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రగతి సక్సెస్ అయ్యింది. రెండు దశాబ్దాలుగా ఆమె బిజీ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది. తల్లి, అత్త పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రగతి సడన్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. డాన్స్ వీడియోలు చేసి పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అనంతరం జిమ్, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలు పంచుకునేది.

ప్రగతి వీడియోలను కొందరు ట్రోల్ చేశారు. ఈ వయసులో నీకు అవసరమా అని ఎద్దేవా చేశారు. వారికి ప్రగతి స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చింది. నా హెల్త్ కోసం నేను జిమ్ చేస్తే మీకు ఇబ్బంది ఏంటి?. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ నేను పట్టించుకోనని ప్రగతి ట్రోలర్స్ కి సమాధానం చెప్పింది. ప్రగతి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొనడం విశేషం. ఆమె బహుమతులు కూడా గెలుచుకుంటుంది.

ప్రగతికి బాగా పేరు తెచ్చిన చిత్రాల్లో ఎఫ్ 3 ఒకటి. తమన్నా, మెహ్రీన్ తల్లిగా ప్రగతి నటించింది. ఆ మూవీలో ఆమె కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ప్రగతి భర్త పాత్ర చేశాడు సీనియర్ నటుడు ప్రదీప్. అంతేగా అంతేగా అని భార్య చెప్పిన దానికి తలాడించే పాత్రలో ప్రదీప్ నవ్వులు పూయించారు. ఆయన ప్రగతి ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారో వెల్లడించారు. ప్రగతి రిజర్వ్డ్ గా ఉంటుంది. తక్కువ మాట్లాడుతుంది. ఒకసారి కలిస్తే చాలా జోవియల్ గా ఉంటుంది. ఆమె రియల్ లైఫ్ కి చేసే పాత్రలకు సంబంధం ఉండదు అన్నాడు. భర్తతో విడిపోయిన ప్రగతి, కూతురితో పాటు ఒంటరిగా ఉంటుంది.

Also Read : ‘బ్లాస్టింగ్’ అట.. ఇంతకీ ఏమిటి ఆ బ్లాస్టింగ్ ?

RELATED ARTICLES

Most Popular