Pakistan cricket team : అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ క్రికెట్ టీం (Pakistan cricket team) వరుస ఓటములు ఎదుర్కొంటోంది. దారుణమైన ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటున్నది.. ఛాంపియన్స్ ట్రోఫీలో దారుణమైన ఆట తీరు తర్వాత పాకిస్తాన్ జట్టు..వైట్ బాల్ ఫార్మాట్ లో సిరీస్ లు ఆడింటికి న్యూజిలాండ్ వెళ్ళింది. అక్కడ కూడా పాకిస్తాన్ ఆట తీరు ఏమాత్రం మారలేదు. ఐదు మ్యాచ్ ల టీ – 20 సిరీస్ లో 4-1 తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది.. ఇక తాజాగా జరుగుతున్న వన్డే సిరీస్ లో కూడా పాకిస్తాన్ ఓటమి దిశగానే ప్రయాణం సాగిస్తోంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా నేపియర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఆట తీరు ఏ మాత్రం మారలేదు. 73 పరుగుల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్ విధించిన 345 రన్ టార్గెట్ ను చేజ్ చేయడంలో పాకిస్తాన్ తడబడింది. రిజ్వాన్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ విధించిన 345 రన్స్ టార్గెట్ ను చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు.. మెరుగైన ఆరంభం లభించినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ విఫలమైంది. దీంతో ఓటమి ఖాయమైంది.. రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఫిలిప్స్, కాన్వే, హెన్రీ వంటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ పాకిస్తాన్ జట్టు ఓడిపోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పాకిస్తాన్ ఇలా ఓడిపోవడం ఆ జట్టు మాజీ ఆటగాళ్లను ఆవేదనకు గురిచేస్తుంది. పాక జట్టు ఆట తీరుపై మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శలు చేశాడు. పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ అజం బ్యాటింగ్ స్థానంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Also Read : పాకిస్తాన్ లో భారత జెండా ఎందుకు పెట్టలేదంటే.. ఎట్టకేలకు స్పందించిన పీసీబీ
ఎందుకు మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలి
“బాబర్ చాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్ గా బరిలోకి వచ్చాడు. చాలామంది అతడ్ని అదే స్థానంలో బ్యాటింగ్ కు రావాలని సూచించారు. అసలు అలా సూచనలు చేసిన క్రికెట్ ప్రొఫెషనల్స్ ఎవరు? ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? వారి ఒత్తిడి వల్లే.. వారు చేసిన సూచనల వల్లే బాబర్ ఓపెనర్ గా వచ్చాడు. న్యూజిలాండ్ సిరీస్ లో మూడో స్థానంలో బాబర్ బ్యాటింగ్ కు వచ్చాడు. మరి అతడు ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడు? ఇప్పుడు క్రికెట్ ప్రొఫెషనల్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.. ఈ సమయంలో వారు బయటకు రాలేరు. క్రికెట్ ప్రొఫెషనల్స్ అని బయట గొప్పగా చెప్పుకుంటున్నవారిని బూట్లతో తన్నాలి. బాబర్, రిజ్వాన్ ను ఓపెనర్లుగా మార్చండి అలాంటి క్రికెట్ ప్రొఫెషనల్సే. ఇలాంటి వారి వల్లే పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఫ్రాంచైజీ టీం గా మారిపోయింది. గొప్ప గొప్ప ఆటగాళ్లతో కూడిన ఆ జట్టు ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇంతటి దుస్థితి ఏ జట్టుకూ రావద్దని” అలీ తన యూట్యూబ్ ఛానల్ లో స్పష్టం చేశాడు.. అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. మరి దీనిపై పాకిస్తాన్ ఆటగాళ్లు ఇంతవరకూ స్పందించలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. అలీ వ్యాఖ్యలతోనైనా పాకిస్తాన్ తదుపరి మ్యాచ్లలో సత్తా చాటుతుందో చూడాలి.
Also Read : పాకిస్తాన్ లో భారత జెండా ఎందుకు పెట్టలేదంటే.. ఎట్టకేలకు స్పందించిన పీసీబీ